Will Smith Packer : విల్ స్మిత్ అరెస్ట్ కు రంగం సిద్దం – ప్యాకర్
స్పష్టం చేసిన ఆస్కార్ నిర్మాత విల్
Will Smith Packer : ప్రపంచం మెచ్చిన దిగ్గజ నటుడు విల్ స్మిత్ అరెస్ట్ కానున్నారా. అవుననే అంటున్నారు ప్రముఖ ఆస్కార్ సినీ నిర్మాత విల్ ప్యాకర్. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో హాస్య నటుడు క్రిస్ రాక్ చెంప ఛెల్లుమనిపించాడు విల్ స్మిత్.
ఈ ఘటన యావత్ సినీ లోకాన్ని, ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. అవార్డు అందజేసేందుకు వచ్చిన క్రిస్ రాక్ విల్ స్మిత్ భార్య గురించి వెకిలి జోక్ చేశాడు.
దీంతో తట్టుకోలేని విల్ స్మిత్(Will Smith ) క్రిస్ రాక్ ను స్టేజి మీదే అందరి ముందు, కోట్లాది మంది చూస్తుండగా కొట్టాడు. విస్తు పోవడం అందరి వంతైంది. తాను చేసింది తప్పేనని ఒప్పుకున్నాడు.
ఈ సందర్బంగా ఆస్కార్ అకాడమీ కమిటీ ఓటింగ్ నిర్వహించింది విల్ స్మిత్ పై చర్యలు తీసుకోవాలా లేదా అనే అంశంపై. ఆస్కార్ రూల్స్ కు విరుద్దంగా విల్ స్మిత్(Will Smith ) వ్యవహరించాడని పేర్కొంది.
ఒక రకంగా తలవంపులు తెచ్చాడని తెలిపింది. ఈ తరుణంలో ఆస్కార్ నిర్మాత్ విల్ ప్యాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నటుడు విల్ స్మిత్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దంగా ఉన్నారని ప్రకటించాడు.
అయితే స్మిత్ కు తర్వాత క్షమాపణలు కూడా చెప్పాడు రాక్. అయితే క్రిస్ ఫిర్యాదు దాఖలు చేసేందుకు నిరాకరించినట్లు లాస్ ఏంజెల్స్ కు చెందిన పోలీసులు వెల్లడించారు.
విల్ స్మిత్ అరెస్ట్ కాకుండా ఉండాలంటే హాస్య నటుడు , బాధితుడైన క్రిస్ రాక్ మౌనంగా ఉండడం లేదా సారీ చెప్పేలా క్షమించడం మినహా మరో మార్గం లేదు. అమెరికాలో రూల్స్ కఠినంగా ఉంటాయి. కొద్ది గంటలు ఆగితే ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Also Read : బిగ్ బి పోస్ట్ కు రష్మిక ఫిదా