Will Smith : ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా హాస్య నటుడు క్రిస్ రాక్ చెంప ఛెళ్లు మనిపించిన దిగ్గజ నటుడు విల్ స్మిత్(Will Smith) ఆస్కార్ అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా అకాడమీ తీసుకునే ఏ నిర్ణయానికైనా లేదా ఎలాంటి పరిణామాలకైనా తాను శిరసా వహిస్తానని రాజీనామా లేఖలో ప్రస్తావించారు.
ఆస్కార్ అవార్డు కమిటీ ఈ మేరకు విల్ స్మిత్ పై చర్యలు తీసుకోవాలా లేదా అన్న దానిపై ఓటింగ్ కూడా నిర్వహించింది. ఈ తరుణంలో ఇప్పటికే విల్ స్మిత్ ఎవరూ ఊహించని రీతిలో రాజీనామా చేయడం విస్తు పోయేలా చేసింది.
ఆయనపై పోలీస్ కేసు ఇంకా నమోదు కాలేదు. కానీ యావత్ ప్రపంచం చూస్తుండగా క్రిస్ రాక్ పై దాడి చేయడం ఆశ్చర్య పోయేలా చేసింది.
తాను కావాలని చేయలేదని అవార్డు తీసుకునేందుకు వెళ్లిన సమయంలో క్రిస్ రాక్ కావాలని తన భార్య పై కుళ్లు జోక్ చేశాడంటూ ఆరోపించారు.
అనంతరం క్షమాపణ కూడా చెప్పారు. క్రిస్ రాక్ సైతం విల్ స్మిత్ కుటుంబానికి సారీ కూడా చెప్పాడు. ఈ తరుణంలో విల్ స్మిత్ (Will Smith)రాజీనామాను ఆమోదించరని అనుకున్నారంతా. కానీ ఆస్కార్ అకాడమీ విల్ స్మిత్ రాజీనామాను ఆమోదించింది.
ఈ మేరకు ఈ విషయాన్ని ప్రకటించింది. క్రమశిక్షణ చర్యలను కొనసాగించేందుకు విల్ స్మిత్ రాజీనామాను స్వీకరించాం, అదే సమయంలో ఆమోదించడం జరిగిందని వెల్లడించింది.
ఇదిలా ఉండగా ఈనెల 18న జరగనున్న తదుపరి షెడ్యూల్ బోర్డు సమావేశానికి ముందు ఏ నిర్ణయం తీసుకునేది ప్రకటిస్తామన్నారు.
Also Read : నట దిగ్గజం జిమ్ క్యారీ గుడ్ బై