Will Smith : ‘ఆస్కార్ అకాడమీ’కి విల్ స్మిత్ రాజీనామా

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన దిగ్గ‌జ న‌టుడు

Will Smith : ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మంలో దిగ్గ‌జ న‌టుడు విల్ స్మిత్(Will Smith) ప్ర‌వ‌ర్తించిన తీరును చూసి యావ‌త్ ప్ర‌పంచం విస్తు పోయింది.

గొప్ప న‌టుడే కాదు అద్భుత‌మైన వ్య‌క్తిత్వం ఉన్న వ్య‌క్తిగా ఆయ‌న పేరొందారు. జీవితం ప‌ట్ల‌, స‌మాజం ప‌ట్ల అత్యంత అవ‌గాహ‌న , ముందు చూపు, మాన‌వీయ‌త క‌లిగిన విల్ స్మిత్ అనుకోకుండా ప్ర‌ముఖ హాస్య న‌టుడు క్రిస్ రాక్ చెంప ఛెళ్లుమ‌నిపించాడు.

దీంతో ఆస్కార్ ఉత్స‌వాల‌కు హాజ‌రైన వేలాది మంది ప్ర‌ముఖుల‌తో పాటు కోట్లాది మంది వీక్ష‌కులు ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. ఎన్న‌డూ కోపం తెచ్చుకోని విల్ స్మిత్ అలా ప్ర‌వ‌ర్తించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం తాను ప్రాణ‌ప్ర‌దంగా ప్రేమించే భార్య గురించి క్రిస్ రాక్ వెకిలిగా మారాడు.

ఆమెపై జోక్ పేల్చాడు. దీనిని త‌ట్టుకోలేని విల్ స్మిత్ అంతా చూస్తుండ‌గానే ఆస్కార్ వేదిక‌పై ఉన్న రాక్ పై చేయి చేసుకున్నాడు. దీంతో ఆస్కార్ అవార్డుల క‌మిటీ ఈ మేర‌కు విల్ స్మిత్ పై చ‌ర్య‌లు తీసుకోవాలా లేదా అన్న దానిపై ఓటింగ్ నిర్వహించింది.

ఈ త‌రుణంలో తాను ఆస్కార్ అకాడ‌మీకి రాజీనామా చేస్తున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు విల్ స్మిత్(Will Smith). బోర్డు త‌గిన‌దిగా భావించే ఏవైనా త‌దుప‌రి ప‌రిణామాల‌ను లేదా తీసుకోబోయే చ‌ర్య‌ల‌కు తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌ని వెల్ల‌డించాడు.

ఈ సంద‌ర్భంగా రాజీనామా చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఇలా పేర్కొన్నారు విల్ స్మిత్. నేను అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్నాను. బోర్డు ఏ నిర్ణ‌యం తీసుకున్నా అంగీక‌రించేందుకు సిద్దంగా ఉన్నాన‌ని తెలిపాడు.

Also Read : పునీత్ ఫ్యామిలీకి రాహుల్ ప‌రామ‌ర్శ

Leave A Reply

Your Email Id will not be published!