Will Smith : విల్ స్మిత్ భావోద్వేగం మన్నించమని విన్నపం
క్రిస్ రాక్ కు కాదు ఆస్కార్ అకాడమీకి క్షమాపణ
Will Smith : ప్రముఖ హాలీవుడ్ నటుడిగా పేరొందిన విల్ స్మిత్ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో క్రిస్ రాక్ చెంప ఛెల్లుమనిపించారు. రాక్ తన భార్య పట్ల నోరు జారడంపై భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేక పోయాడు.
ఈ సందర్భంగా రాక్ విల్ స్మిత్ కుటుంబానికి క్షమించమని వేడుకున్నాడు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. తీవ్ర చర్చకు దారి తీసింది. వ్యక్తిగా విల్ స్మిత్(Will Smith )గొప్ప నటుడు.
అంతకంటే కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. కన్నీళ్ల విలువేంటో తెలుసు. కానీ అనుకోకుండా జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రపంచం ముందు తల వంచుకునేలా చేసింది.
దీనిని ముందే గుర్తించిన విల్ స్మిత్ (Will Smith )తన తప్పు తెలుసుకున్నాడు. ఈ మేరకు ఆస్కార్ అకాడెమీ కమిటీకి మన్నంచమని కోరాడు. ఇదే సమయంలో అత్యంత భావోద్వేగ పూరితమైన ప్రసంగం చేశాడు.
కన్నీళ్లతో నిండిన ఆయన తనను పదే పదే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని విన్నవించాడు. అయితే ఈ క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నది క్రిస్ రాక్ కు కాదు. ఆస్కార్ అకాడమీకి . నా తోటి నామినీలందరికీ నేను క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నా.
ఇది ఒక అందమైన క్షణం. నేను అవార్డు గెలుచుకున్నందుకు ఏడ్వడం లేదు. నాకు అవార్డు రావడం కాదు. ఇది ప్రజలందరి పైనా వెలుగులు నింపగలగడం అని పేర్కొన్నాడు.
కళ జీవితాన్ని అనుకరిస్తుంది. రిచర్డ్ విలియమ్స్ గురించి చెప్పినట్ఏల నేను వెర్రి తండ్రిలా కనిపిస్తున్నాను. ప్రేమ మిమ్మల్ని పిచ్చి పనులు చేసేలా చేస్తుందన్నాడు విల్ స్మిత్.
నేను జీవితంలో ప్రజలను ప్రేమించాలని కోరుతూ వచ్చా. నేను సినిమాల్లో నటించగలను తప్పా జీవితంలో నటించ లేనన్నాడు.
Also Read : రవితేజ సరసన కేథరిన్ థ్రెసా