Lucknow Super Giants 2022 : ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రాణిస్తారా

ఐపీఎల్ 2022లో కొత్త‌గా ఎంట్రీ

Lucknow Super Giants 2022 : (Indian Premier League) ఇండియ‌న్ ప్ర‌మియ‌ర్ లీగ్ – (IPL 2022) ఐపీఎల్ 2022 కు ముహూర్తం ఫిక్స్ అయి పోయింది. కొద్ది గంట‌ల్లో ప్ర‌పంచంలోనే అతి పెద్ద మెగా రిచ్ లీగ్ టోర్నీ సంబురం ప్రారంభం కానుంది. ఈ త‌రుణంలో ఈసారి గ‌తంలో కంటే భిన్నంగా రెండు కొత్త జ‌ట్లు వ‌చ్చి చేరాయి.

ప్ర‌పంచ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని రీతిలో భారీ ఎత్తున ఆదాయం స‌మ‌కూరింది

బీసీసీఐకి ఈ రెండింటి ద్వారా. గ‌తంలో జ‌రిగిన 14 సీజ‌న్ల‌లో ఎనిమిది జ‌ట్లు మాత్ర‌మే పాల్గొన్నాయి.

కానీ ఈసారి 10 జ‌ట్లు పాల్గొన‌నున్నాయి. కోట్లాది క్రీడాభిమానులు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్న

ఐపీఎల్ (IPL 2022) లో మెరుపులు మెరిపించేందుకు రెడీ అవుతోంది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(Lucknow Super Giants 2022). క‌రోనా కార‌ణంగా 25 శాతం మంది మాత్ర‌మే ప‌ర్మిష‌న్ ఇచ్చింది.

ల‌క్నో భారీ ధ‌ర‌కు ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. ఇక లీగ్ ప‌రంగా చూస్తే కొత్త జ‌ట్టు అయిన‌ప్ప‌టికీ స్టార్ ఆట‌గాళ్ల‌ను స్వంతం చేసుకుంది.

దేశంలోనే పేరొందిన గోద్రెజ్ సంస్థ దీనిని ఓన్ చేసుకుంది.

ఆ సంస్థ చైర్మ‌న్ ఆర్పీ సంజీవ్ గోయెంకా దీనికి ఓన‌ర్ గా ఉన్నారు. రైజింగ్ సూప‌ర్ జెయింట్స్ 2016, 2017 లో ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వ‌హించింది.

భార‌త జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్ ఈ జ‌ట్టుకు నాయ‌కుడిగా ఉన్నాడు.

గ‌తంలో పంజాబ్ కింగ్స్ కు స్కిప్ప‌ర్ గా ఉన్నాడు. ఇక గంభీర్ దీనికి మెంటార్ గా ఎంపిక‌య్యాడు. ర‌వి బిష్ణోయ్ , మార్క‌స్ ను తీసుకుంది.

అవేష్ ఖాన్ , దీప‌క్ హూడా, మ‌నీశ్ పాండే, కృష్ణ‌ప్ప గౌత‌మ్ , కృనాల్ పాండ్యా ఉన్నారు.

ఇక క్వింట‌న్ డికాక్ , జాస‌న్ హోల్డ‌ర్ , మార్క్ వుడ్ , ఎవిన్ లెవిస్ కీల‌కంగా మార‌నున్నారు.

ఇక ఐపీఎల్ (IPL) లో కేఎల్ రాహుల్ ప‌రుగులు సాధించ‌డంలో టాప్ స్కోర‌ర్ గా ఉన్న‌ప్ప‌టికీ జ‌ట్టును విజ‌య‌వంతంగా న‌డిపించ లేక పోయాడు.

ఈ త‌రుణంలో ల‌క్నోను ఎలా నెట్టుకు వ‌స్తాడ‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ జ‌ట్టుకు కేఎల్ తో పాటు హోల్డ‌ర్ , స్టోయినిస్ , పాండే, డికాక్ , బిష్ణోయ్ లు ఏ క్ష‌ణంలోనైనా మ్యాచ్ ను తిప్ప‌గ‌ల స‌మ‌ర్థులు.

Also Read : టైటిల్ రేసులో కోల్‌కతా నైట్ రైడర్స్

Leave A Reply

Your Email Id will not be published!