Virat Kohli : చోటు కోసం రన్ మెషీన్ తండ్లాట
కోహ్లీ తప్పుకున్నాడా తప్పించారా
Virat Kohli : ప్రపంచ క్రికెట్ లో మోస్ట్ పాపులర్ క్రికెటర్ గా పేరొందాడు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli). టెస్టు, వన్డే, టి20 ఫార్మాట్ లలో టన్నుల కొద్దీ పరుగులు చేసి తనకంటూ ఎదురే లేదని చాటిన ఈ రన్ మెషీన్ ప్రస్తుతం పరుగుల లేమితో నానా తంటాలు పడుతున్నాడు.
తన కెరీర్ లో లెక్కలేనన్ని సెంచరీలు, హాఫ్ సెంచరీల మోత మోగించిన ఈ అరుదైన బ్యాటర్ ఇప్పుడు ఫోర్లు, సిక్సర్ల సంగతి పక్కన పెడితే కనీసం సింగిల్స్ , డబుల్ రన్స్ తీసేందుకు ఇబ్బంది పడుతున్నాడు.
గత నాలుగు సంవత్సరాల కాలంలో విరాట్ కోహ్లీ ఖాతాలో ఒక్క సెంచరీ నమోదు కాక పోవడం గమనార్హం. అడపా దడపా హాఫ్ సెంచరీ చేసినా ఆశించిన స్థాయిలో ఆట తీరు ఉండడం లేదు.
ఒక దశలో అలవోకగా పరుగులు సాధించిన ఈ స్టార్ క్రికెటర్ ఇప్పుడు డిఫెన్స్ ఆడేందుకు ఇష్ట పడుతున్నాడంటే అర్థం చేసుకోవచ్చు.
తాజాగా భారత్ లో జరిగిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2022లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ గా తప్పుకున్నా సరిగా రాణించ లేక పోయాడు.
ఇక యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతూ రాణిస్తున్నారు. దీంతో తాజా, మాజీ ఆటగాళ్లు భారత సెలెక్షన్ కమిటీపై మండిపడుతున్నారు. వెంటనే విరాట్ కోహ్లీని తప్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఏకంగా ఎందుకు తీసేయడం లేదంటూ ప్రశ్నించాడు. ఇక విండీస్ టూర్ లో భాగంగా బీసీసీఐ ప్రకటించిన టి20 జట్టులో విరాట్ కోహ్లీని తప్పించారు.
ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్ కప్ లో కోహ్లీ(Virat Kohli) ఉంటాడా ఉండడా అన్న అనుమానం నెలకొంది.
Also Read : పార్లమెంట్ సత్కారం ‘దాదా’ ఆనందం