Sunil Gavaskar : ఐపీఎల్ అయితే రెస్ట్ తీసుకుంటారా – స‌న్నీ

భార‌త ఆట‌గాళ్ల‌పై నిప్పులు చెరిగిన మాజీ కెప్టెన్

Sunil Gavaskar : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న భార‌త జ‌ట్టు ఆట‌గాళ్ల తీరుపై మండిప‌డ్డారు. ప‌దే ప‌దే సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌తో పాటు మ‌రికొంద‌రు క్రికెట‌ర్లు రెస్ట్ తీసుకోవ‌డంపై సీరియ‌స్ అయ్యారు.

అంత‌ర్జాతీయ క్రికెట్ లో టెస్టులు, వ‌న్డేలు, టి20 ఫార్మాట్ ల‌లో అందుబాటులో ఉండ‌క పోవ‌డం, పైగా రెస్ట్ పేరుతో దూరంగా ఉండ‌డాన్ని త‌ప్పు ప‌ట్టాడు.

అయితే కాసులు కురిపించే ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో మాత్రం ఎందుకు రెస్ట్ తీసుకోవ‌డం లేద‌ని సూటిగా ప్ర‌శ్నించారు. కాసుల‌పై ఉన్నంత శ్ర‌ద్ధ ఆట‌పై లేకుండా పోయింద‌న్నారు.

ప్ర‌ధానంగా టెస్టులు అనేస‌రిక‌ల్లా ఓపిక లేకుండా పోయింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆటంటే డ‌బ్బు మాత్ర‌మే కాద‌న్నారు. ఈ మాత్రం ఆడ‌లేక పోతే ఇక జ‌ట్టుకు ఆడ‌డం ఎందుక‌ని నిల‌దీశారు సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్(Sunil Gavaskar).

ఒక ర‌కంగా బీసీసీఐ సెలెక్ట‌ర్ల‌పై చుర‌క‌లు అంటించాడు. ప‌దే ప‌దే భార‌త ఆట‌గాళ్లు మ్యాచ్ ల‌కు దూరం కావ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టాడు. కోహ్లీ, పంత్ , బుమ్రా, రోహిత్ త‌దిత‌ర క్రికెట‌ర్ల‌ను ప‌క్క‌న పెట్ట‌డంపై మండి ప‌డ్డాడు.

ఏం సాధించార‌ని వీళ్ల‌కు రెస్ట్ పేరుతో విశ్రాంతి ఇస్తున్నారంటూ నిప్పులు చెరిగాడు సునీల్ గ‌వాస్క‌ర్. ఐపీఎల్ లో ఆడుతున్న స‌మ‌యంలో రెస్ట్ తీసుకోరు.

కానీ భార‌త దేశం కోసం ఆడుతున్న మ్యాచ్ ల‌లో మాత్రం దూరంగా ఉంటారు. దీనికి నేను ఒప్పుకోనంటూ బహిరంగంగా కామెంట్స్ చేశాడు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది.

Also Read : చండీమాల్ ఆట తీరుకు స‌ర్వ‌త్రా ఫిదా

Leave A Reply

Your Email Id will not be published!