Surya Kumar Yadav : సూర్య భాయ్ కీలకం లేకపోతే కష్టం – సన్నీ
అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు
Surya Kumar Yadav : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లో నాలుగు జట్లు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. గ్రూప్ -1 నుంచి న్యూజిలాండ్ , ఇంగ్లండ్ , గ్రూప్ -2 నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
ఈ టోర్నీలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీతో పాటు మరో హిట్టర్ సూర్య కుమార్ యాదవ్ , హార్దిక్ పాండ్యా కష్ట కాలంలో రాణించారు. జట్టును గట్టెక్కించారు. ఇక కేఎల్ రాహుల్ స్టార్టింగ్ లో రాణించక పోయినా ఆ తర్వాత గాడిలో పడ్డాడు. ఇక రిషబ్ పంత్ కు ఛాన్స్ రాలేదు. మరో వైపు నెదర్లాండ్స్ సౌతాఫ్రికాను ఓడించడంతో మెరుగైన రన్ రేట్ ఆధారంగా పాకిస్తాన్ కు లక్ కలిసొచ్చింది.
సెమీస్ కు చేరింది ఆ జట్టు. ఈ తరుణంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు సునీల్ గవాస్కర్. ప్రధానంగా సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav ) ఆడుతున్న తీరును ప్రశంసించాడు. అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడారు. అంతే కాదు జట్టులో కీలకంగా మారాడని పేర్కొన్నాడు. అతడు లేక పోతే టీమిండియాకు కష్టమేనని పేర్కొన్నాడు.
రాబోయే సెమీస్ లో సూర్య కుమార్ యాదవ్ ఆట తీరుపై జట్టు జయాపజయాలు మిళితమై ఉంటాయని స్పష్టం చేశాడు. ఒకవేళ సూర్య గనుక ఆడక పోతే జట్టు భారీ స్కోర్ సాధించడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఆడే జట్టు సూర్య భాయ్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతుందనడంలో సందేహం లేదన్నాడు సన్నీ.
Also Read : ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా కోహ్లీ