KTR: బీఆర్ఎస్ ర్యాలీలో అపశృతి ! మహిళా కానిస్టేబుల్‌ కు గాయాలు !

బీఆర్ఎస్ ర్యాలీలో అపశృతి ! మహిళా కానిస్టేబుల్‌ కు గాయాలు !

KTR : కరీంనగర్‌ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో బందోబస్తుకు వచ్చిన మహిళా కానిస్టేబుల్‌ పద్మజను ఓ బీఆర్ఎస్ కార్యకర్త ప్రమాదవశాత్తు బుల్లెట్‌ తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆమె కాలు విరగడంతో… హుటాహుటీన ఆమెను ఆసుపత్రికి తరలించారు. దీనితో ఈ విషయం తెలిగానే కేటీఆర్‌… ఆసుపత్రికి వెళ్ళి ఆమెను పరామర్శించారు. చికిత్సకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్‌(KTR) వెంట బీఆర్ఎస్ నేతలు వినోద్‌, గంగుల కమలాకర్‌, కౌశిక్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

KTR Comment

ఈ ర్యాలీ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి 14 నెలల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనకబాటు చెందిందని ఆరోపించారు. ఉచిత పథకాల పేరుతో హామీలు ఇచ్చి… అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా హామీలకు రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ తిలోదకాలు ఇచ్చిందని విమర్శించారు.

తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని ఆయన నిర్ణయించారు. ఆ క్రమంలో ఇప్పటికే కేటీఆర్… సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. నేడు (ఆదివారం) కరీంనగర్‌లో కేటీఆర్ పర్యటిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు కావోస్తుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ వేదికగా రజతోత్సవ సభ ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం నిర్ణయించింది. ఈ సభను మార్చి 27వ తేదీన కరీంనగర్‌లో నిర్వహించాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లపై చర్చించడమే కాకుండా… ఈ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తుంది. అందులోభాగంగా ఆదివారం బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్‌తోపాటు ఆ పార్టీలోని పలువురు కీలక నేతలు కరీంనగర్ చేరుకున్నారు.

Also Read : CM Revanth Reddy: శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం

Leave A Reply

Your Email Id will not be published!