Modi Women Boxers : మహిళా బాక్సర్లకు మోదీ అభినందన
మీ విజయం దేశానికి ఆదర్శనీయం
Modi Women Boxers : ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించి భారత దేశానికి గర్వ కారణంగా నిలిచిన మహిళా బాక్సర్లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు.
ప్రధాన మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిఖత్ జరీన్ , మేరీ కోమ్ , సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ ఉన్నారు. మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కు సంబంధించి నిఖత్ జరీన్ ఐదో మహిళ గా చరిత్ర నిలిచారు.
ఇటీవల ముగిసిన ఛాంపియన్ షిప్ లో భారత్ ఒక స్వర్ణం , రెండు కాంస్య పతకాలు సాధించింది. గత నెలలో జరిగిన ఈ పోటీల్లో విజేతలైన మహిళా బాక్సర్లతో ప్రధాని సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వారిని ప్రత్యేకంగా అభినందించారు మోదీ(Modi Women Boxers).
వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. మీరు సాధించిన ఈ విజయం దేశానికి గర్వ కారణమని పేర్కొన్నారు. బంగారు పతకాన్ని నిఖత్ జరీన్ గెలుచు కోగా 57 కేజీల విభాగంలో మనీషా మౌన్ , 63 కేజీల విభాగంలో ఎంట్రీ లోనే పతకం సాధించిన క్రీడాకారిణి పర్వీన్ హూడా కాంస్య పతకాలను గెలుచుకున్నారు.
ఇదిలా ఉండగా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు చివరి బంగారు పతకం 2018లో వచ్చింది. లైట్ ఫ్లై వెయిట్ విభాగంలో (48 కిలోలు) ఉక్రెయిన్ కు చెందిన హన్నా ఒఖోటాను మేరీ కోమ్ ఓడించి చరిత్ర సృష్టించింది.
12 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఈసారి పోటీల్లో పాల్గొంది. నాలుగేళ్ల తర్వాత పసిడి తీసుకు వచ్చింది నిఖత్ జరీన్.
Also Read : నిఖత్ జరీన్..ఇషా సింగ్ కు నజరానా