Jess Jonassen : సారా వేర్న్ తో జోనాస్సెన్ పెళ్లి

ఇద్ద‌రూ స్టార్ మ‌హిళా క్రికెట‌ర్లు

Jess Jonassen : చిర‌కాల స్నేహితురాలు సారా వేర్న్ తో ప్రేమ‌లో ప‌డింది ప్ర‌ముఖ క్రికెట‌ర్ జెస్ జోనా సెన్. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకుంది. జోనా సెన్ మ‌హిళా ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌పున ఆడుతోంది. ఆస్ట్రేలియ‌న్ మ‌హిళా టీమ్ లో ఆల్ రౌండ‌ర్ గా గుర్తింపు పొందింది జెస్ జోనాస్సెన్(Jess Jonassen).

సారా వేర్న్ ను ఏప్రిల్ 6న హ‌వాయిలో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట పెళ్లికి ముందు 10 సంవ‌త్స‌రాల‌కు పైగా డేటింగ్ చేశారు.

ఈ జంట నీలి స‌ముద్రం ముందు ఉన్న ఒక సుంద‌ర‌మైన ప్ర‌దేశంలో ప్ర‌త్యేక రోజును ఆస్వాదించారు. కొత్త ప్రారంభానికి గుర్తుకు ఇద్ద‌రూ ప్ర‌మాణం చేసి ముద్దు పెట్టుకున్నారు. నేను ఇలా జ‌రుగుతుంద‌ని సారా వేర్న్ తో బంధం బ‌ల‌ప‌డుతుంద‌ని అనుకోలేని పేర్కొంది జెస్ జోనాస్సేన్(Jess Jonassen). ఎట్ట‌కేల‌కు మేమిద్ద‌రం క‌లిసి పోయామ‌ని తెలిపింది.

జోనాస్సేన్ త‌న లైంగిక ధోర‌ణి గురించి బ‌హిరంగంగానే ప్ర‌క‌టించింది. గ‌ర్వంగా త‌న‌ను తాను లెస్బియ‌న్ గా పేర్కొంది. ఇదిలా ఉండ‌గా ఆస్ట్రేలియా దేశంలో 2017లో స్వ‌లింగ వివాహం చ‌ట్ట బ‌ద్దం చేసింది ప్ర‌భుత్వం. దీంతో ఈ ఇద్ద‌రు క్రికెట‌ర్ల‌కు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండ‌దు.

ఈ జంట 2020లోనే పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నారు. కానీ క‌రోనా కార‌ణంగా ఆల‌స్య‌మైంది. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు ఒక్క‌టి కావ‌డంతో అంతులేని సంతోషానికి లోన‌య్యారు జోనా స్సెన్ , సారా వేర్న్.

Also Read : దంచి కొట్టిన హ్యారీ బ్రూక్

Leave A Reply

Your Email Id will not be published!