Women IPL Auction : విమెన్ ఐపీఎల్ వేలంలో కాసుల పంట
బీసీసీఐకి రూ. 4,669 కోట్ల ఆదాయం
Women IPL Auction : మార్చిలో నిర్వహించే మహిళా ఐపీఎల్ వేలం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఊహించని రీతిలో భారీ ఆదాయాన్ని సమకూర్చి పెట్టింది. ఒక రకంగా మెన్స్ ఐపీఎల్ తో సమాన స్థాయిలో రికార్డు ధర పలకడం విశేషం. ఏకంగా మహిళా క్రికెట్ చరిత్రలో ఇది ఓ రికార్డ్ గా భావించక తప్పదు.
బీసీసీఐకి రూ. 4,669 కోట్లు సమకూరాయి. ఐదు మహిళా జట్లకు వేలం పాట(Women IPL Auction) నిర్వహించింది బీసీసీఐ ఐపీఎల్ కమిటీకి. అదానీ గ్రూప్ అత్యధికంగా రూ. 1289 కోట్లతో బిడ్ లో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మూడు ఐపీఎల్ జట్లను కలిగి ఉంటాయి.
అహ్మదాబాద్ జట్టు ను అదానీ గ్రూప్ కైవసం చేసుకుంది అత్యధిక ధరకు కొనుగోలు చేసింది. ముంబై జట్టును రిలయన్స్ గ్రూప్ రూ. 912 కోట్లకు, బెంగళూరు మహిళా జట్టును డియో జియో (ఆర్సీబీ) రూ. 901 కోట్లకు , లక్నో జట్టును కాప్రి గ్లోబల్ రూ. 757 కోట్లు, ఢిల్లీ జట్టును డీసీ ఫ్రాంచైజీ రూ. 810 కోట్లకు చేజిక్కించుకుంది.
ఈ సందర్భంగా బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జేషా సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక ధరకు పలికిన వేలం పాటగా ఇండియన్ విమెన్ ఐపీఎల్ మిగిలి పోతుందని స్పష్టం చేశారు. బిడ్ లు వేసినందుకు , స్వంతం చేసుకున్న ఫ్రాంచైజీలను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.
గ్లోబల్ వేదికపై మహిళా క్రికెటర్లు సత్తా చాటుతారన్న నమ్మకం తనకు ఉందన్నారు. భారీ ధరకు కొనుగోలు చేయడం విస్తు పోయేలా చేసింది.
Also Read : హిట్ మ్యాన్ అరుదైన రికార్డ్