Wrestlers Row Comment : రెజ్లర్ల పోరాటం ఖాకీల ఉక్కుపాదం
నిరసన తెలపడం కూడా నేరమేనా
Wrestlers Row Comment : బేటీ బచావో బేటీ పడావో అంటూ నిత్యం ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో తమకు న్యాయం జరగాలని కోరుతూ రోడ్డెక్కినా పట్టించుకోక పోగా చివరకు మహిళలని(Wrestlers Row Comment) చూడకుండా దాడికి పాల్పడడం చర్చకు దారి తీసింది. ఈ దేశం ప్రజాస్వామిక ప్రాతిపదికన కొనసాగుతోందని, అది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సాక్షిగా నడుస్తోందంటూ పదే పదే ప్రగల్భాలు పలుకుతన్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు.
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మంది మహిళా మల్ల యోధులు ఆందోళన బాట పట్టారు. వారికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. కానీ వారిని చులకన చేసే ప్రయత్నం జరిగింది. వాళ్లు చేసిన నేరం ఏమిటంటే తాము లైంగిక వేధింపులకు గురవుతున్నామని బయటకు చెప్పడమే.
ఆ తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. ఆయన గత ఆరు పర్యాయాలుగా ఎంపీగా కొనసాగుతూ వచ్చారు. అంతే కాదు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ గా కొనసాగుతున్నారు.
మహిళా రెజ్లర్లు గతంలో తాము పలుమార్లు క్రీడా శాఖ ఉన్నతాధికారికి తెలిపినా పట్టించు కోలేదని చివరకు గత్యంతరం లేక బయటకు రావాల్సి వచ్చిందంటూ వాపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీయడంతో గత్యంతరం లేని పరిస్థితిలో కేంద్రం రంగంలోకి దిగింది. క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మహిళా రెజ్లర్లు(Wrestlers Row Comment) చేసిన ఆరోపణలపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశారు. మేరీ కోమ్ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేశారు.
బ్రిజ్ భూషణ్ ను తొలగించాలని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. చివరకు ఆ నివేదక డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కు అనుకూలంగా నివేదిక ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు రెజ్లర్లు వినీష్ ఫోగట్ , సాక్షి మాలిక్, తదితరులు. సర్కార్ నుంచి స్పందన రాక పోవడంతో తిరిగి గత ఏప్రిల్ 23న రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షకు దిగారు.
వారికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , మమతా బెనర్జీ, తదితరులు మద్దతు ప్రకటించారు. ఈ తరుణంలో అనురాగ్ ఠాకూర్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు మద్దతు ఇస్తున్నారే తప్పా తమ గోడు పట్టించు కోవడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు బాధిత మహిళలు.
దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఐఓసీ చైర్మన్ గా ఉన్న పీటీ ఉష సైతం చులకన చేసి మాట్లాడారు. ఆమెపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. తట్టుకోలేక నిరసన దీక్ష శిబిరం వద్దకు చేరుకున్నారు. చేసేది లేక వెనుదిరిగారు.
ఈ తరుణంలో ఉన్నట్టుండి ఢిల్లీ పోలీసులు మే 3న అర్ధరాత్రి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే మహిళా రెజ్లర్లపై దాడికి దిగారు. కొందరు గాయపడ్డారు. ఖాకీలు ప్రవర్తించిన తీరు పట్ల దేశం యావత్తు విస్తు పోయింది. ఈ మొత్తం వ్యవహారంలో మోదీ సర్కార్ చూసీ చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Also Read : మహిళా రెజ్లర్లపై దాడి సిగ్గుచేటు