AFC Womens Asia Cup 2022 : మహిళల ఆసియా కప్ షెడ్యూల్
అన్ని టీమ్ ల జట్లు ఇవే
AFC Womens Asia Cup 2022 : మహిళల ఆసియా కప్ -2022 ప్రారంభం(AFC Womens Asia Cup 2022) కానుంది అక్టోబర్ 1 శనివారం నుండి. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే యూఏఈ వేదికగా జరిగిన పురుషుల ఆసియా కప్ ను శ్రీలంక ఎగరేసుకు పోయింది. ఈ మెగా టోర్నీ 15 రోజుల పాటు కొనసాగుతుంది. అక్టోబర్ 1న బంగ్లాదేశ్ వర్సెస్ థాయ్ లాండ్ , భారత్ వర్సెస్ శ్రీలంక మహిళా జట్లు తలపడతాయి.
ఇక అక్టోబర్ 2న పాకిస్తాన్ మహిళా జట్టు మలేషియాతో , శ్రీలంక జట్టు యూఏఈ మహిళా జట్టుతో తలపడతాయి. అక్టోబర్ 3న పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ , భారత్ వర్సెస్ మలేషియా జట్లు తలపడాయి. అక్టోబర్ 4న శ్రీలంక వర్సెస్ థాయ్ లాండ్ , భారత్ వర్సెస్ యూఏఈ మహిళా జట్ల మధ్య పోటీ జరుగుతుంది.
అక్టోబర్ 5న యూఏఈ మహిళా జట్టు మలేషియా జట్టుతో తలపడనుంది. అక్టోబర్ 6న పాకిస్తాన్ వర్సెస్ థాయ్ లాండ్ , బంగ్లాదేశ్ వర్సెస్ మలేషియా జట్లతో పోటీ పడతాయి. అక్టోబర్ 7న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మహిళా జట్లు తలపడతాయి. అక్టోబర్ 8న శ్రీలంక వర్సెస్ మలేషియా, భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మహిళా జట్లు తలపడనున్నాయి.
అక్టోబర్ 9న థాయ్ లాండ్ వర్సెస్ మలేషియా , పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ మహిళా జట్లు పోటీ పడతాయి. అక్టోబర్ 10న శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ , భారత్ వర్సెస్ థాయ్ లాండ్ జట్లు తలపడతాయి.
అక్టోబర్ 11న బంగ్లాదేశ్ వర్సెస్ యూఏఈ జట్లు , పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక జట్లు పోటీ పడతాయి. అక్టోబర్ 12న మొదటి సెమీ ఫైనల్ , సెమీ ఫైనల్ -2 మ్యాచ్ లు జరుగుతాయి. అక్టోబర్ 15న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
Also Read : జస్ప్రీత్ బుమ్రా ప్లేస్ లో మహ్మద్ సిరాజ్