Swati Maliwal : సాజిద్ ఖాన్ కు మ‌హిళా క‌మిష‌న్ షాక్

బిగ్ బాస్ నుంచి తొల‌గించాల‌ని ఆదేశం

Swati Maliwal :  ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ ఖాన్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. బిగ్ బాస్ షో నుంచి సాజిద్ ఖాన్ ను వెంట‌నే తొల‌గించాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు అత‌డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ కేంద్ర స‌మాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు లేఖ రాసింది. ప్ర‌స్తుతం జాతీయ మ‌హిళా క‌మిష‌న్ రాసిన లేఖ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది సినీ వ‌ర్గాల్లో.

ఇదిలా ఉండ‌గా సాజిద్ ఖాన్ పై ప‌లువురు మ‌హిళ‌లు లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేశారు. 2018లో ఇండియ‌న్ ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ (ఐఎఫ్‌టిడీఏ) ఏకంగా సాజిద్ ఖాన్ పై ఒక సంవ‌త్స‌రం పాటు స‌స్పెండ్ చేసింది.

ఈ మొత్తం వ్య‌వ‌హారంపై మహిళ‌ల నుంచి వ‌చ్చిన ఆరోప‌ణ‌లు, ఐఎఫ్‌టిడీఏ ఒక ఏడాది పాటు నిషేధం విధించ‌డాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది మ‌హిళా క‌మిష‌న్. రియాలిటీ షో బిగ్ బాస్ నుండి వెంట‌నే సాజిద్ ఖాన్ ను త‌ప్పించాల‌ని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చీఫ్ స్వాతి మ‌లివాల్(Swati Maliwal) కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు లేఖ రాశారు.

బిగ్ బాస్ 16వ సీజ‌న్ మొద‌టి ఎపిసోడ్ అక్టోబ‌ర్ 1న ప్రారంభ‌మైంది. ఈ షోకు న‌టుడు స‌ల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మీటూ ఉద్య‌మం సంద‌ర్భంగా 10 మంది మ‌హిళ‌లు సాజిద్ ఖాన్ పై లైంగిక వేధింపులు ఆరోప‌ణ‌లు చేశారు. ఈ ఫిర్యాదుల‌న్నీ సాజిద్ ఖాన్ అస‌హ్య‌క‌ర‌మైన మ‌న‌స్తత్వాన్ని చూపుతున్నాయి. అలాంటి వ్య‌క్తికి బిగ్ బాస్ లో చోటు క‌ల్పించారంటూ ట్వీట్ చేశారు.

Also Read : అత‌ను ఎప్ప‌టికీ నాతోనే ఉంటాడు

Leave A Reply

Your Email Id will not be published!