Womens Day : ఆకాశంలోనే కాదు అన్నింటా సగ భాగమైన మహిళలకు సంబంధించిన మహిళా దినోత్సవం ఇవాళ జరుపుకుంటున్నాం. మహిళల సాంస్కృతిక, రాజకీయ, సామాజిక ఆర్థిక విజయాల జ్ఞాపకార్థం ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(Womens Day) నిర్వహిస్తారు.
ఒక రకంగా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు,యువతులకు, బాలికలకు సెలవు దినం. లింగ సమానత్వం,
పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింస, దుర్వినియోగం వంటి సమస్యలపై దృష్టి సారిస్తూ మహిళల హక్కుల ఉద్యమంలో ఇది కేంద్ర బిందువుగా ఉంది.
న్యూజిలాండ్ లో ప్రారంభమైన సార్వత్రిక మహిళా ఓటు హక్కు ఉద్యమం ద్వారా ప్రేరేపించబడింది. 20వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తర అమెరికా, ఐరోపాలో కార్మిక ఉద్యమాల నుంచి ఉద్భవించింది.
అమెరికా లోని న్యూయార్క్ నగరంలో 1909 ఫిబ్రవరి 28న సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా పెద్ద ఎత్తున మహిళా దినోత్సవాన్ని(Womens Day) నిర్వహించింది.
1910లో అంతర్జాతీయ సోషలిస్ట్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ లో జర్మన్ ప్రతినిధులను ప్రతి ఏటా ప్రత్యేక మహిళా దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించేందుకు ప్రేరేపించింది.
1917లో సోవియట్ రష్యాలో మహిళలు ఓటు హక్కు పొందిన తర్వాత మార్చి 8న అంతర్జాతీయ విమెన్స్ డేను జాతీయ సెలవు దినంగా మార్చారు. ఆ తేదీని సోషలిస్టు ఉద్యమాలు, కమ్యూనిస్టు దేశాలు జరుపుకున్నాయి.
1960 దశకం చివరిలో ప్రపంచ స్త్రీవాద ఉద్యమం ద్వారా దీనిని స్వీకరించింది. 1977లో ఐక్య రాజ్య సమితి ఆమోదించిన తర్వాత మహిళా దినోత్సవం ప్రధాన స్రవతిలో సెలవు దినంగా జరుపుతూ వస్తున్నారు.
ఆనాటి నుంచి ప్రతి దేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.
ప్రధానంగా మహిళలకు సమాన హక్కులు ఉండాలని, వారిని మనుషులుగా చూడాలని, వారికి ప్రత్యేకమైన రోజులు అవసరమని మహిళలు ప్రదర్శనలు , ఆందోళనలు , నిరసనలు వ్యక్తం చేయడం విశేషం.
తరాలు మారినా, టెక్నాలజీలో పెను మార్పులు చోటు చేసుకున్నా ఈరోజు వరకు ఇంకా వారికి సమాన హక్కులు రాలేదు. ఇప్పటికీ ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉన్నది. తమకు స్వేచ్చ కావాలని వారు కోరుతున్నారు.
Also Read : ఆత్మ విశ్వాసం ఆమె ఆయుధం