Womens IPL 2023 : మ‌హిళా ప్రీమియ‌ర్ లీగ్ షురూ

గుజ‌రాత్ ముంబై ట‌ఫ్ ఫైట్

Womens IPL 2023 : ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న మ‌హిళా ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్) శ‌నివారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే జ‌ట్లు జెర్సీల‌ను(Womens IPL 2023) రిలీజ్ చేశాయి. రిచ్ లీగ్ లో తొలిసారిగా 5 జ‌ట్లు పాల్గొంటున్నాయి. ముంబై స్టార్ క్రికెట‌ర్ స్మృతీ మంధాన అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయింది.

ఆర్సీబీ రూ. 3.4 కోట్ల‌కు తీసుకుంది. గుజ‌రాత్ టైటాన్స్ కు మెంటార్ గా మాజీ క్రికెట‌ర్ మిథాలీ రాజ్ ఎంపికైంది. ఇక భార‌త మ‌హిళా(Womens IPL 2023) జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ముంబై ఇండియ‌న్స్ మ‌హిళా జ‌ట్టు కు స్కిప్ప‌ర్ గా ప్ర‌క‌టించింది. మార్చి 4 నుంచి 26 వ‌ర‌కు డ‌బ్ల్యూపీఎల్ జ‌ర‌గ‌నుంది.

రిచ్ లీగ్ లో భాగంగా గుజ‌రాత్ , ముంబై మ‌ధ్య తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబై వేదిక‌గా బీవై పాటిల్ , బ్ర‌బౌర్న్ స్టేడియంలో మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో 20 లీగ్ మ్యాచ్ లు , 2 ప్లే ఆఫ్స్ ఉంటాయి. ఇక లీగ్ ద‌శ‌లో ఒక్క టీమ్ 8 మ్యాచ్ లు ఆడుతుంది.

తొలి మూడు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయి. లీగ్ ద‌శ‌లో టాప్ లో ఉన్న జట్టు డైరెక్టుగా ఫైన‌ల్ కు చేరుకుంటుంది. ఇక లీగ్ లో 2, 3వ ప్లేస్ ల‌లో ఉన్న జ‌ట్లు ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు త‌ల‌ప‌డతాయి. ఇక పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో నిలిచిన జ‌ట్టు ఐపీఎల్ ట్రోఫీ కోసం బ‌రిలో త‌ల‌ప‌డ‌తాయి.

బెత్ మూనీ సార‌థ్యంలోని గుజ‌రాత్ జెయింట్స్ , హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి.

Also Read : సంజూ శాంస‌న్ పై ఎందుకీ వివ‌క్ష‌

Leave A Reply

Your Email Id will not be published!