INDW vs AUSW T20 World Cup : 23న ఆసిస్ భార‌త్ సెమీస్

24న ఇంగ్లండ్ వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా

INDW vs AUSW T20 W Cup : ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ తుది అంకానికి చేరుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ట్లు ఆడాయి. మొత్తం మెగా టోర్నీలో 10 జ‌ట్లు పాల్గొన్నాయి. రెండు గ్రూప్ లుగా ఆడాయి. ఒక్కో గ్రూప్ లో 5 జ‌ట్లు ఉన్నాయి. చివ‌ర‌కు రెండు గ్రూప్ ల‌కు సంబంధించి సెమీ ఫైన‌ల్ బెర్త్ లు ఖ‌రారు అయ్యాయి. మొద‌టి సెమీ ఫైన‌ల్ కీల‌క మ్యాచ్ భార‌త్ , ఆస్ట్రేలియా(INDW vs AUSW T20 W Cup) జ‌ట్ల మ‌ధ్య జ‌రగ‌నుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు జ‌ట్లు హాట్ ఫెవ‌రేట్ గా ఉన్నాయి. వాటిలో ముందంజ‌లో కొన‌సాగుతున్నాయి డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ , భార‌త్ , సౌతాఫ్రికా. తాజాగు తుది పోరుకు రెడీ అయ్యాయి. ఇక గ్రూప్ -బిలో ఇంగ్లండ్ నాలుగు మ్యాచ్ లు ఆడింది. ఆడిన అన్ని మ్యాచ్ ల‌లో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. గ్రూప్ లో టాప్ లో నిలిచింది. ఇక గ్రూప్ – ఎలో ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్ లు ఆడింది. ఆడిన అన్ని మ్యాచ్ ల‌లోనూ గెలుపొందింది.

ఇదిలా ఉండ‌గా ఫిబ్ర‌వ‌రి 24న ఇంగ్లండ్ , ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య సెమీ ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. ఇక స్మృతీ మంధాన ఐర్లాండ్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో దుమ్ము రేపింది. 56 బంతులు ఆడి 87 ర‌న్స్ చేసింది. మంధాన సూప‌ర్ ఫామ్ లోకి రావ‌డం శుభ ప‌రిణామం. ఇక ఆస్ట్రేలియా జ‌ట్టు అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో అత్యంత బ‌లంగా ఉంది. రేప‌టి మ్యాచ్ లో పై ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : శాంస‌న్ వ‌న్డేల‌కు ప‌నికి రాడా – థ‌రూర్

Leave A Reply

Your Email Id will not be published!