Womens T20 World Bangladesh : సై అంటున్న బంగ్లాదేశ్
తక్కువ అంచనా వేయొద్దు
Womens T20 World Bangladesh : ఐసీసీ టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఏ జట్టును తక్కువ అంచనా వేసేందుకు వీలు లేదు. ఎందుకంటే ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. నమ్మకం పెట్టుకుంటే ఒక్కోసారి అంచనాలు తప్పుతాయి. అనుకోని జట్టే అద్భుతం సృష్టించే ఛాన్స్ లేక పోలేదు. మైదానంలో ఆడే ఆట తీరును బట్టి విజయావకాశాలు ఉంటాయి. ఇక ప్రపంచ క్రికెట్ లో ఇప్పుడు పొట్టి ఫార్మాట్ రాజ్యం ఏలుతోంది. ఎక్కడ చూసినా టీ20 , టీ10 ఫార్మాట్ లే కనిపిస్తున్నాయి.
ప్రపంచంలోని పలు దేశాలన్నీ ఇవే జపం చేస్తున్నాయి. ఇక మెగా వరల్డ్ కప్ గురించి చెప్పాల్సి వస్తే ఫిబ్రవరి 10న మొదటి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 26న వరల్డ్ కప్ ఫైనల్ తో ముగుస్తుంది. మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.
రెండు గ్రూప్ లలో 5 జట్ల చొప్పున ఆడతాయి. రెండు సెమీస్ ఉంటాయి. ఆ రెండింట్లో గెలుపొందిన జట్లు ఫైనల్ లో ఆడతాయి. భారీ నజరానా కూడా దక్కనుంది విజేతకు. ఇక ఈసారి తమ సత్తా ఏమిటో రుచి చూపిస్తామంటున్నారు బంగ్లాదేశ్(Womens T20 World Bangladesh) అమ్మాయిలు. ఇటు బ్యాటింగ్ లో అటు బౌలింగ్ లో తమను తక్కువ అంచనా వేయొద్దంటున్నారు.
మొత్తంగా బంగ్లా జట్టు చూస్తే ఇలా ఉంది. షమీమా సుల్తానా, రుమానా అహ్మద్, జహనారా ఆలం, నిగర్ సుల్తానా జోటీ, మారుఫా అక్టర్, ఫాహిమా ఖాతున్, సల్మా ఖాతున్, లతా మోండోల్, షోర్నా అక్టర్, నహిదా అక్టర్, ముర్షిదా ఖాతున్, రీతు మోని, దిశా బిస్వాస్, శోభనా మోస్తరీ, ఫర్గానా హోక్ పింకీ, మరియు, సంజిదా అక్తేర్ మమ్లా ఆడనున్నారు.
Also Read : న్యూజిలాండ్ సత్తా చాటేనా