Womens T20 World Cup Ireland : రెఢీ అంటున్న ఐర్లాండ్
వరల్డ్ కప్ లో పోటీకి సై
Womens T20 World Cup Ireland : దక్షిణాఫ్రికాలో క్రికెట్ సంబురం మొదలైంది. మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది ఆ దేశం. ఇక అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. మహిళా క్రికెట్ కు సంబంధించి ఐసీసీ ఆధ్వర్యంలో పొట్టి ఫార్మాట్ లో టీ20 వరల్డ్ కప్ నిర్వహిస్తోంది.
ఇందుకు సంబంధించి కొన్ని గంటల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు ఈ వరల్డ్ కప్ కొనసాగుతుంది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసింది ఐసీసీ. భారీగా నజరానా కూడా ప్రకటించింది.
ఇదిలా ఉండగా మొత్తం ఈ మెగా టోర్నీలో 10 జట్లు పాల్గొంటున్నాయి. రెండు గ్రూప్ లుగా విభజించింది ఐసీసీ. ప్రతి గ్రూప్ లో 5 జట్లు ఉంటాయి. ప్రతి జట్లు ఇంకో జట్టుతో ఆడుతుంది. మొదటి, రెండో సెమీ ఫైనల్ ఉంటుంది. 26న ఫైనల్ తో పూర్తవుతుంది.
ఒకవేళ ఏదైనా అంతరాయం వాటిల్లితే గనుక రిజర్వ్ డేను కేటాయించింది ఐసీసీ ముందు జాగ్రత్తగా. ఇదిలా ఉండగా సత్తా చాటేందుకు ఐర్లాండ్ మహిళా జట్టు రెడీ(Womens T20 World Cup Ireland) అయ్యింది. ఈ మేరకు ఆ దేశం పూర్తి జట్టును ప్రకటించింది. ఈసారి ఎలాగైనా సరే సత్తా చాటుతామని తమ పవర్ ఏమిటో చూపిస్తామని అంటున్నారు ఐర్లాండ్ జట్టు అమ్మాయిలు.
ఇక వరల్డ్ కప్ లో ఆడే ఐర్లాండ్ జట్టు ఇలా ఉంది. కారా ముర్రే, లూయిస్ లిటిల్, సోఫీ మాక్మాన్, జేన్ మాగైర్, జార్జినా డెంప్సే, అమీ హంటర్, షానా కవానాగ్, అర్లీన్ కెల్లీ, రెబెక్కా స్టోకెల్, మేరీ వాల్డ్రాన్, కారా ముర్రే, లేహ్ పాల్, ఓర్లా ప్రెండర్గాస్ట్ మరియు అమీ హంటర్ ఆడతారు.
Also Read : ఊపు మీదున్న ఇంగ్లాండ్