Netherlands Poised : నెదర్లాండ్స్ లో చట్టంగా వర్క్ ఫ్రం హోమ్
ఇక ఇంటి నుంచి పని చేసేందుకు హక్కు
Netherlands Poised : టెక్నాలజీ పెరుగుతోంది. పెను మార్పులకు లోనవుతోంది. రాబోయే రోజుల్లో మరింత మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈ తరుణంలో ప్రపంచం మరింత చిన్నదవుతోంది. దేశాల(Netherlands Poised) మధ్య బంధాలు దగ్గరవుతున్నాయి.
ఇదే సమయంలో యావత్ లోకాన్ని పట్టి పీడించి, బెంబేలెత్తించిన కరోనా మహమ్మారి దెబ్బకు దేశాలన్నీ కుదలేయ్యాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కరోనా నేర్పిన పాఠం చాలా కంపెనీలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలను పునరాలోచించేలా చేశాయి.
ప్రధానంగా ఐటీ సెక్టార్ లో ఉద్యోగులు రమ్మన్నా రావడం లేదు. ఎక్కువ ప్యాకేజీ ఇస్తామని ఆఫర్లు ఇచ్చినా డోంట్ కేర్ అంటున్నారు. ఇప్పటికే ఆపిల్ , మైక్రో సాఫ్ట్, గూగుల్, డెలాయిట్, తదితర కంపెనీలన్నీ ప్లీజ్ ఆఫీసులకు రండి అని కోరినా వద్దే వద్దంటున్నారు.
తమకు ఇల్లే సౌకర్యంగా ఉంటోందంటూ స్పష్టం చేస్తుండడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ తరుణంలో మరో సంచలనానికి దారి తీసింది నెదర్లాండ్స్. అదేమిటంటే వర్క్ ఫ్రం హోమ్ (ఇంటి వద్ద నుండే పని ) కి పచ్చ జెండా ఊపింది.
దీనిని చట్ట పరంగా హక్కును పొందేలా తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేసింది. ఈ మేరకు ఇంటి వద్ద నుండి పని చేసేలా డచ్ పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించింది.
దీని వల్ల ఆ దేశంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో పని చేసే వారికి వర్తిస్తుందని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఇంటి నుండి పని చేయడం చట్టపరమైన హక్కుగా మార్చడానికి డచ్ పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించింది.
కాగా యూరోపియన్ దేశం ఇప్పుడు సెనేట్ ఆమోదం కోసం వేచి చూడాల్సి ఉంది.
Also Read : సెప్టెంబర్ 5న బ్రిటన్ ప్రధాని ఎంపిక