Iga Swiatek : ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ విజేత స్వియా టెక్

18 ఏళ్ల కోకో గాఫ్ పై ఘ‌న విజ‌యం

Iga Swiatek : ఓడి పోయినా అమెరిక‌న్ టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ చ‌రిత్ర సృష్టించింది. ఫ్రెంచ్ ఓపెన్ విమెన్ సింగిల్స్ టోర్నీలో పోలాండ్ కు చెందిన స్టార్ ప్లేయ‌ర్ స్వియా టెక్ వ‌రుస సెట్ల‌లో గెలుపొందింది.

ఇది ఆమెకు వ్య‌క్తిగ‌తంగా 35వ విక్ట‌రీ కావ‌డం విశేషం. ప్ర‌తిష్టాత్మ‌క ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ చేజిక్కించు కోవ‌డంతో స్వియా టెక్(Iga Swiatek) కు ఏకంగా రూ. 18 కోట్ల 30 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ ద‌క్కింది.

ఇక టెన్నిస్ చ‌రిత్ర‌లో ష‌ర‌పోవా త‌ర్వాత కేవ‌లం 18 ఏళ్ల వ‌య‌సులోనే ఫ్రెంచ్ ఓపెన్ ఫైన‌ల్ కు చేరుకున్న క్రీడాకారిణిగా అరుదైన ఘ‌న‌త వ‌హించింది కోకో గాఫ్‌. దీంతో ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన కోకో గాఫ్ కు రూ. 9 కోట్ల 15 ల‌క్ష‌లు బ‌హుమ‌తిగా ద‌క్కాయి.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే సింగిల్స్ ఫైనల్ లో టాప్ సీడ్ గా ఉన్న స్వియా టెక్ కేవ‌లం 68 నిమిషాల‌లోనే గేమ్ ముగించింది. స్వియా టెక్ వ‌రుస సెట్ల‌లో 6-1 , 6-3 తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది.

ఈ ఏడాదిలో ఈ గేమ్ గెల‌వ‌డంతో ఆమె త‌న కెరీర్ లో అత్య‌ధిక విజ‌యాలు న‌మోదు చేసింది. ఈ మ్యాచ్ తో స్వీయా టెక్(Iga Swiatek) 35 సార్లు విజ‌యం సాధించింది. వ్య‌క్తిగ‌తంగా ఆమెకు ఇది ఆరో టైటిల్ కావ‌డం విశేషం.

21 ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన స్వియా టెక్(Iga Swiatek) తొలి చాంపియ‌న్ గా నిలిచి చ‌రిత్ర సృష్టించింది. కాగా తొలిసారి టోర్నీలో అద్భుత విజ‌యాలు సాధిస్తూ వ‌చ్చిన న‌ల్ల క‌లువ తుది పోరులో ఒత్తిడికి లోనైంది.

ఈ గేమ్ లో నాలుగు సార్లు మాత్ర‌మే ప్ర‌తిఘ‌టించింది. ఆ తర్వాత ఏ ద‌శ‌లోనూ పోటీ ఇవ్వ‌లేక పోయింది.

Also Read : నాద‌ల్ స్ఫూర్తికి క్రీడా లోకం ఫిదా

Leave A Reply

Your Email Id will not be published!