WPL 2023 GG vs MI : ముంబై దెబ్బ‌కు గుజ‌రాత్ విల‌విల

ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ లో విక్ట‌రీ

WPL 2023 GG vs MI : ముంబై వేదిక‌గా ఎంతో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన తొలి రిచ్ లీగ్ ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ లో(WPL 2023) ప్రారంభ మ్యాచ్ లోనే హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ టీం దుమ్ము రేపింది. ఏకంగా 143 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. మొత్తంగా ఆల్ రౌండ్ షో ప్ర‌ద‌ర్శ‌న‌తో ముంబై ఇండియ‌న్స్ ఆక‌ట్టుకుంది. గుజ‌రాత్ జెయింట్స్ టాప్ ఆర్డ‌ర్ కుప్ప కూలింది. ముందుగా కౌర్ టాస్ ఓడి పోయి బ్యాటింగ్ కు దిగింది.

తొలి సీజ‌న్ లో బోణీ కొట్టింది. ఆస్ట్రేలియా స్కిప్ప‌ర్ సార‌థ్యం వ‌హిస్తున్న గుజ‌రాత్ జెయింట్స్(WPL 2023 GG vs MI) ఏ మాత్రం స‌త్తా చాట‌లేక పోయింది. భారీ స్కోర్ చేసి ఒత్తిడి పెంచింది. మ‌రో వైపు బౌలింగ్ ప‌రంగా క‌ట్ట‌డి చేయ‌డంతో ప‌రుగులు చేయ‌లేక చ‌తికిల ప‌డింది. ప్రారంభం నుంచే వికెట్లను కూల్చ‌డంతో ఏ కోశాన ధీటుగా జ‌వాబు ఇవ్వ‌లేక పోయింది. గుజ‌రాత్ జెయింట్స్ టాప్ ఆర్డ‌ర్ కుప్ప కూలింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 207 ర‌న్స్ చేసింది. స్కిప్ప‌ర్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది. కేవ‌లం 30 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ 30 బాల్స్ ఎదుర్కొని 65 ర‌న్స్ చేసింది. ఇందులో 14 ఫోర్లు ఉన్నాయి. ఆమెతో పాటు మాథ్యూస్ 47 , అమేలియా 45 ర‌న్స్ తో రాణించారు.

అనంత‌రం భారీ టార్గెట్ తో మైదానంలోకి దిగిన గుజ‌రాత్ జెయింట్స్ 15.1 ఓవ‌ర్ల‌లోనే 64 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. 9 వికెట్లు కోల్పోయింది. హేమ‌ల‌త 29 , మోనికా ప‌టేల్ 10 ర‌న్స్ త‌ప్ప ఇంకెవ‌రూ స‌త్తా చాట‌లేక పోయారు.

Also Read : పేల‌వ‌మైన ఆట తీరుతో ప‌రేషాన్

Leave A Reply

Your Email Id will not be published!