WPL 2023 RCB vs DC : ఆర్సీబీ ముందు బిగ్ టార్గెట్
2 వికెట్లకు ఢిల్లీ 223 రన్స్
WPL 2023 RCB vs DC : ముంబై వేదికగా ప్రారంభమైన బీసీసీఐ టాటా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జరుగుతున్న రెండో లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 223 రన్స్ చేసింది. స్మృతీ మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ముందు భారీ టార్గెట్ నిర్దేశించింది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు గుజరాత్ జెయింట్స్ ను ఓడించింది. ఆర్సీబీ స్కిప్పర్ స్మృతీ మంధాన టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆర్సీబీ బౌలర్లు ఏ కోశాన ఢిల్లీ ఆటగాళ్లపై ప్రభావం చూపలేక పోయారు. ఒక రకంగా ఆర్సీబీ బౌలర్లకు(WPL 2023 RCB vs DC) చుక్కలు చూపించారు. గెలవాలంటే 224 పరుగులు చేయాల్సి ఉంది ఆర్సీబీ. వరల్డ్ కప్ లో సత్తా చాటిన షెఫాలీ వర్మ అత్యధికంగా 84 రన్స్ చేసింది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ క్రికెటర్ , ఢిల్లీ క్యాపిటల్స్ స్కిప్పర్ మెక్ లానింగ్ 72 రన్స్ చేసి కీలక పాత్ర పోషించింది. వీరిద్దరూ తొలి వికెట్ కు ఏకంగా 162 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు.
తొలి సీజన్ లో ఇది ఓ రికార్డ్ . ఇక ఆర్సీబీ తరపున కేవలం హీథర్ నైట్ తప్ప ఏ బౌలర్ వికెట్లు తీయలేదు. తీసిన ఆ రెండు వికెట్లు ఆమె ఖాతాలోకి వెళ్లాయి. 10 ఓవర్లలో 100 రన్స్ మార్క్ దాటింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆర్సీబీ కెప్టెన్ మంధాన ఏడు మందిని ప్రయోగించింది. అయినా ఫలితం లేక పోయింది.
Also Read : ఆసిస్ ఫ్యాన్స్ తగ్గేదే లే..వైరల్