WPL Auction 2023 : మహిళల ఐపీఎల్ వేలం షురూ
మార్చిలో ఐపీఎల్ మెగా టోర్నీ
WPL Auction 2023 : ప్రపంచ క్రికెట్ లో మొదటిసారిగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మహిళా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఐదు ఫ్రాంచైజీలు తమ పేర్లు నమోదు చేసుకున్నాయి. భారీ ఎత్తున ఆదాయం సమకూరింది బీసీసీఐకి. ఇక వేలం పాట ప్రారంభం కానుండడంతో ఏయే మహిళా క్రికెటర్లకు ఎంతెంత డబ్బులు వస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ప్రధానంగా ఆటగాళ్లను చూస్తే మహిళా క్రికెటర్లలో స్మృతీ మంధాన, షెఫాలీ వర్మ, భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ , ఆల్ రౌండర్ దీప్తి శర్మ లకు కనీసం రూ. 2 కోట్లు దక్కుతాయని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దేశీయ ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్లలో హీలీ, బెత్ మూనీ, ఎలిస్సే పెర్రీ, స్కివర్ , మేగాన్ , డాటిన్ లు భారీ ధర పలకనున్నారు. ఈ వేలం పాటలో ఐపీఎల్ కు(WPL Auction 2023) సంబంధించి ముంబై ఇండియన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ , బెంగళూరు , గుజరాత్ జెయింట్స్ , యూపీ వారియర్స్ మొత్తం 409 మంది ఆటగాళ్లను ఎంపిక చేయనున్నాయి. ఈ వేలం పాటలో 90 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి ఫ్రాంచైజీలు.
ఒక్కో జట్టుకు ఒక్కో ఏడాదికి రూ. 12 కోట్ల పర్స్ కేటాయించింది బీసీసీఐ. ఇందులో భారత్ కు చెందిన వారితో పాటు విదేశాలకు చెందిన ఆటగాళ్లను ఎంపిక చేసుకోనున్నారు. ధర పరంగా చూస్తే రూ. 10 లక్షలు ప్రారంభ ధరగా నిర్ణయించింది బీసీసీఐ. రూ. 50 లక్షలతో పాటు రూ. 20 లక్షలు, రూ. 30 లక్షలు, రూ. 40 లక్షలు గా ఉంది. ఆయా ఆటగాళ్లలో రిచా , రేణుకా , రాజేశ్వరి, రాధా, మేఘనా , శిఖా , జెమీమా రోడ్రిగ్స్ కూడా భారీగా ధర పలకనున్నారు.
ఇదిలా ఉండగా మెగా టోర్నీలో మొత్తం 5 ఫ్రాంచైజీలు ఉన్నాయి. కనీస వేతనం రూ. 9 కోట్లు, గరిష్ట వేతనం రూ. 12 కోట్లు , స్క్వాడ్ 15 మంది , గరిష్టంగా 18 మంది ఆటగాళ్లు ఉండవచ్చు. ఇందులో భారత ఆటగాళ్లు 12 మంది ఉంటారు. విదేశీ ఆటగాళ్లు 6 ఉండాలి. మొత్తం ఆటగాళ్ల సంఖ్య 409 ఉండగా వేలానికి భారత ఆటగాళ్లు 246 , విదేశీ ఆటగాళ్లు 155 మంది ఉన్నారు.
Also Read : మూడో టెస్టు వేదిక మార్పు – బీసీసీఐ