Wriddhiman Saha : ఐపీఎల్ టోర్నీలో యువకులు రెచ్చి పోతున్నారు. సీనియర్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రతి జట్టులో ఇద్దరు లేదా ముగ్గురు యువ ఆటగాళ్లు రాణిస్తూ తాము సైతం జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తామని చెప్పకనే చెబుతున్నారు.
తాజాగా గుజరాత్ టైటాన్స్ జట్టు చివరి బంతి దాకా పోరాడి అద్భుత విజయాన్ని నమోదు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో. రషీద్ ఖాన్ కమాల్ చేస్తే..వృద్ధి మాన్ సాహా (Wriddhiman Saha )అద్భుతమైన రీతిలో పర్ పార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.
జట్టు విజయంలో ముఖ్య భూమికను పోషించాడు. కేవలం 38 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వృద్ది మాన్ సాహా 68 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు ఓ సిక్స్ కూడా ఉంది.
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ కావడంతో వృద్ది మాన్ సాహా మారథాన్ ఇన్నింగ్స్ కు తెర పడింది.
సాహాతో పాటు గతంలో రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన రాహుల్ తెవాటియా ఈసారి గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు.
ఇతడిని ఏరికోరి ఎంచుకుంది గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం. ఆశిష్ నెహ్రా హెడ్ కోచ్ గా ఉన్నాడు ఈ జట్టుకు. హార్దిక్ పాండ్యా స్కిప్పర్ గా ఉన్నాడు.
తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు రాహుల్ తెవాటియా. ఎక్కడా తగ్గకుండా ఆడాడు. కేవలం 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న తెవాటియా 40 రన్స్ చేసి నాటౌట్ గా మిగిలాడు. ఇందులో 4 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి.
Also Read : రాజస్థాన్ రాజసం సమిష్టికి సంకేతం