WT20 World Cup 2024 : రేపు పాకిస్థాన్ తో తలపడనున్న భారత క్రికెట్ టీమ్

ఈసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకునేందుకు టీం ఇండియా చక్కటి సన్నద్ధతతో దూసుకెళ్లింది...

WT20 World Cup : ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలోనే రేపు (అక్టోబర్ 6న) పాకిస్తాన్‌తో టీమిండియా రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ప్రస్తుతం తొలి మ్యాచ్‌లో ఓడిన భారత్ తర్వాతి మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి అని చెప్పవచ్చు. అంతేకాదు ఇప్పటికే పాకిస్తాన్(Pakistan) జట్టు శ్రీలంకను ఓడించింది. దీంతో రేపటి మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా కొనసాగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

WT20 World Cup 2024 Updates

ఈసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకునేందుకు టీం ఇండియా(India) చక్కటి సన్నద్ధతతో దూసుకెళ్లింది. కానీ తొలి మ్యాచ్‌లోనే ఆ కోరిక తీరకుండానే ఓడిపోయింది. ప్రస్తుతం మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు గ్రూప్ ఏలో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు పాకిస్తాన్(Pakistan), న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో నెట్ రన్ రేట్ మైనస్ 2.900కు చేరింది. ఇప్పుడు సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే టీమ్ ఇండియా తన మిగిలిన మ్యాచ్‌లలో తప్పకుండా గెలిచి తీరాలి. ఇక భారత మహిళల జట్టు, పాకిస్తాన్ మహిళల జట్టు మధ్య ఇప్పటివరకు మొత్తం 15 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. అందులో భారత జట్టు 12 విజయాలు సాధించగా, పాకిస్తాన్ మహిళల జట్టు 3 మాత్రమే గెలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో టీ20లో పాకిస్తాన్ కంటే భారత జట్టు చాలా ముందుందని చెప్పవచ్చు. మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మొత్తం 7 మ్యాచ్‌లు జరిగాయి.

అందులో భారత జట్టు 5, పాకిస్థాన్ 2 మ్యాచ్‌లు గెలిచాయి. చివరిసారి 2022 టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు తలపడగా, భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఏ లెక్కన చూసినా కూడా టీమిండియా జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇటివల శ్రీలంకను ఓడించిన పాకిస్తాన్, మంచి ఫాంలో ఉన్న నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందో ఉంటుందో చూడాలి మరి.

మహిళల T20 ప్రపంచకప్ కోసం ఇరు జట్ల స్క్వాడ్‌లు:

భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), యాస్తికా భాటియా (వికెట్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికె), పూజా వస్త్రాకర్, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్, దయాళన్ హేమలత , ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజీవన్ సజ్నా

పాకిస్తాన్ మహిళల జట్టు: మునిబా అలీ (WK), గుల్ ఫిరోజా, సిద్రా అమీన్, నిదా దార్, ఫాతిమా సనా (c), అలియా రియాజ్, తుబా హసన్, సదాఫ్ షమాస్, నష్రా సంధు, డయానా బేగ్, ఇరామ్ జావేద్, ఒమైమా సోహైల్, సయ్యదా అరుబ్ షా, తస్మియా రుబాబ్

Also Read : Hanumantha Rao : బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో హరీష్ రావు ఆలోచించాలి

Leave A Reply

Your Email Id will not be published!