Xiaomi ED Siezed : ప్రపంచంలో టాప్ స్మార్ట్ ఫోన్ ల తయారీదారుగా పేరొందిన చైనాకు చెందిన దిగ్గజ కంపెనీ షావోమీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ చేసిన అక్రమ చెల్లింపులకు సంబంధించి ఈడీ (Xiaomi ED Siezedదర్యాప్తు ప్రారంభించింది.
సదరు కంపెనీకి చెంది రూ. 5, 551 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ప్రకటించింది. ఇండియా ఎంఐ బ్రాండ్ పేరుతో భారత్ దేశంలో ప్రముఖ మొబైల్ ఫోన్ ల ఉత్తత్తి మరియు పంపిణీ దారుగా ఉంది.
దాంతో విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనలపై దర్యాస్తు సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) శనివారం స్మార్ట్ ఫోన్ షియోమీని స్వాధీనం చేసుకుంది. షావోమీ ఇండియా అనేది చైనా ఆధారత షావోమీ గ్రూప్(Xiaomi ED Siezed) లోని యాజమాన్యంలోని అనుబంధం సంస్థ.
ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ 1999 నిబంధనల ప్రకారం కంపెనీ బ్యాంకు ఖాతాల నుండి రూ. 5,551. 27 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది.
ఈ ఏడాదిలో కంపెనీ చేసిన అక్రమ చెల్లింపులకు సంబంధించి ఫిర్యాదులు రావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఎంఐ ఇండియా భారత దేశంలో తన కార్యకలాపాలను 2014లో ప్రారంభించింది.
2015 నుంచి డబ్బులను పంపించడం స్టార్ట్ చేసింది. ఇది ఇప్పటి వరకు రాయల్టీ ముసుగులో షావోమీ గ్రూప్ సంస్థతో సహా మూడు విదేశీ ఆధారిత సంస్థలకు రూ. 5, 551 .27 కోట్లకు సమానమైన విదేశీ కరెన్సీని పంపినట్లు ఈడీ వెల్లడించింది.