Yashasvi Jaiswal : ఆస్ట్రేలియా గడ్డపై రికార్డుల మోత మోగిస్తున్న యశస్వి జైస్వాల్

23ఏళ్ల వయసులోపే అత్యధిక సెంచరీలు సాధించిన ఐదో భారత బ్యాటర్ జైస్వాల్ (4)...

Yashasvi Jaiswal : ఆస్ట్రేలియా గడ్డపై భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సత్తా చాటాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం పెర్త్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సెంచరీతో కదం తొక్కాడు. 205 బంతుల్లో శతకం సాధించాడు. టెస్ట్ కెరీర్‌లో నాలుగో సెంచరీ సాధించిన జైస్వాల్ ఈ క్రమంలో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి 15 టెస్ట్‌ల్లోనే 1500 పైచిలుకు పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు.

Yashasvi Jaiswal Innings..

ఆస్ట్రేలియాగడ్డపై ఆడిన తొలి టెస్ట్‌లోనే సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. యశస్వి కంటే ముందు జై సింహా, సునీల్ గవాస్కర్ ఈ ఘనత సాధించారు. ఇక, ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన రెండో యంగెస్ట్ ఓపెనర్‌గా కూడా జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ (22 ఏళ్ల 330 రోజులు) కంటే ముందు కేఎల్ రాహుల్ (22 ఏళ్ల 263 రోజులు) ఈ ఘనత సాధించాడు. అలాగే ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన 23 ఏళ్ల లోపు ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ (3 సెంచరీలు) ఐదో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో గవాస్కర్ (ఒక ఏడాదిలో 4 సెంచరీలు) ఉన్నాడు.

23ఏళ్ల వయసులోపే అత్యధిక సెంచరీలు సాధించిన ఐదో భారత బ్యాటర్ జైస్వాల్ (4). ఈ జాబితాలో అందరి కంటే ముందు సచిన్ (8 సెంచరీలు) ఉన్నాడు. అలాగే ఇన్నింగ్స్‌ల పరంగా చూసుకుంటే అత్యంత వేగంగా 1500 పైచిలుకు పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ రెండో స్థానంలో ఉన్నాడు. జైస్వాల్ 28 ఇన్నింగ్స్‌ల్లో 1500 పరుగులు పూర్తి చేశాడు. అంతకుముందు పుజార కూడా 28 ఇన్నింగ్స్‌ల్లోనే 1500 పరుగుల మార్క్ దాటాడు.

Also Read : KTR : సీఎం రేవంత్ రెడ్డి ది నోరు కాదు మూసీ నది అందుకే మాయమాటలు వస్తున్నాయి

Leave A Reply

Your Email Id will not be published!