YCP MPs : ఈసీని కలిసిన వైసీపీ ఎంపీలు
టీడీపీ హయాంలో దొంగ ఓట్లు
YCP MPs : న్యూఢిల్లీ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో కొలువు తీరిన టీడీపీ ప్రభుత్వ హయాంలో దొంగ ఓట్లు నమోదు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ ఎంపీలు. రాజ్య సభ్యుడు విజయ సాయి రెడ్డి(Vijayasai Reddy) సారథ్యంలో వైసీపీ ఎంపీలు గురుమూర్తి, సత్యవతి, చెవిరెడ్డి, అయోధ్య రామి రెడ్డి గురువారం న్యూఢిల్లో లోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించారు.
YCP MPs Met EC
ఈ సందర్బంగా టీడీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమ ఓట్ల నమోదుపై ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు. విచారణ చేపట్టాలని కోరారు.
దీని వల్ల ఎవరు ఎక్కడ ఉన్నారో , ఎవరు అసలు ఓటర్లు లేదా ఎవరు నకిలీ ఓటర్లు అని తెలుసుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించు కోలేదని పేర్కొన్నారు.
అన్ని వ్యవస్థలను మ్యానేజ్ చేసే అలవాటు కలిగిన చంద్రబాబు నాయుడు దొంగ ఓట్లను నమోదు చేయించడంలో కూడా కీలక పాత్ర పోషించారని సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి. ఈ మొత్తం వ్యవహారం పై సమగ్రంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. తాము ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఈసీ సానుకూలంగా స్పందించిందని తెలిపారు .
Also Read : KCR Discharge : రేపే మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్