Jason Holder : వెస్టిండీస్ క్రికెటర్ హోల్డర్ సంచలన కామెంట్స్ చేశాడు. భారత్ లో విండీస్ టీ20, వన్డే మ్యాచ్ లు ఆడనుంది. ఈ తరుణంలో తాము ఇప్పటికే బలమైన ఇంగ్లండ్ ను ఓడించి సీరీస్ చేజిక్కించు కున్నామని ఇక భారత్ వంతు మిగిలి ఉందన్నాడు.
తాము టీ20, వన్డే సీరీస్ గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తామన్నాడు. టీమిండియా బలమైన జట్టు అయినా ఇటీవల దాని ఆట తీరు అంతగా ఆకట్టు కోవడం లేదన్నాడు.
ఒక రకంగా ఇంగ్లండ్ ను చిత్తు చేసిన ఉత్సాహంలో తాము ఉన్నామని ఇక మిగిలింది భారత్ ఒక్కటేనని స్పష్టం చేశాడు. స్వదేశంలో భారత్ అద్భుతంగా ఆడుతుందని, ఆ మేరకు దాని ట్రాక్ రికార్డు కూడా సూపర్ అని ఒప్పుకున్నాయి.
అయితే తమ జట్టును తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదన్నాడు. తమ జట్టులోని కొందరు ఆటగాళ్లు, స్కిప్పర్ తో సహా భారత్ లో ఎప్పటి నుంచో ఆడుతున్నారని చెప్పాడు.
ఐపీఎల్ లో ఆడిన అనుభవం తమకు కలిసి వస్తుందని స్పష్టం(Jason Holder) చేశాడు. కాగా తమకు టీమిండియాను చిత్తు చేసే దమ్ము ఉందని మరిచి పోవద్దని హెచ్చరించాడు హోల్డర్.
గత రెండేళ్ల నుంచి భారత్ లో ఆ జట్టు గణనీయమైన విజయాలు నమోదు చేసిందన్నాడు. ఇదిలా ఉండగా తమ ఆటగాళ్లలో భేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్ని ఖండించారు.
ఇదిలా ఉండగా టీమిండియా టూర్ లో భాగంగా విండీస్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఈనెల 6న తొలి వన్డే ప్రారంభం కానుంది.
Also Read : కెప్టెన్..కోచ్ లను మార్చేది లేదు