IPL Auction 2022 : సినిమా, క్రీడా రంగాలలో ప్రధానంగా వినిపించే పేరు ఏమిటంటే విజయం ఉంటేనే జనం వెంట పడతారు. ప్రపంచం ఫోకస్ పెడుతుంది. ఒక వేళ రాణించక పోతే ఇక అంతే సంగతులు.
ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (IPL Auction 2022)అన్నది అత్యంత రిచ్ మెగా లీగ్. దీనిలో ఆడే వాళ్లకు ఉన్నంత క్రేజ్ ఇంకే ఆటకు లేదంటే అతిశయోక్తి లేదు.
గత కొంత కాలంగా ఐపీఎల్ లో దుమ్ము రేపుతూ వచ్చిన ఆటగాళ్లు, హీరోలుగా కీర్తించబడిన వాళ్లు ఇప్పుడు ఉన్నట్టుండి జీరోలుగా మారి పోయారు.
తాజాగా బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరుగుతోంది.ఇందులో ఎవరినీ పాల్గొన్న 10 ఫ్రాంచైజీలు పట్టించు కోలేదు. పూర్తిగా పక్కన పెట్టేశాయి.
వేలంపాట నిర్వాహకుడు చారు శర్మ లిస్టులో పేర్లు చదివినా డోంట్ కేర్ అనడంతో విస్తు పోవడం బీసీసీఐ వంతు అయ్యింది.
విచిత్రం ఏమిటంటే గత కొంత కాలంగా చెన్నై సూపర్ కింగ్స్ కు మూల స్తంభంగా ఉంటూ విజయంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన సురేష్ రైనాను పట్టించు కోలేదు.
ఒకప్పుడు ఐపీఎల్ ను శాసించాడు. రూ. 2 కోట్ల బిడ్ తో వేలం పాటలోకి వచ్చినా ఏ ఫ్రాంచైజీ చూడలేదు. సీఎస్కే కూడా పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఇక ఇదే బేస్ ధరతో వేలం పాటకు వచ్చిన స్మిత్ , ఆడమ్ జంపా, ఇమ్రాన్ తాహిర్ , ఆదిల్ రషీద్ , వేడ్ , బిల్డింగ్స్ , మహ్మద్ నబీ, డేవిడ్ మిల్లర్ , సందీప్ లామిచా ను ఏ ఫ్రాంచైజీ పట్టించు కోలేదు. భవిష్యత్తులో ఏ ఆటగాడైనా గాయపడితే వీరికి ఛాన్స్ ఉంది.
Also Read : భారీ ధర పలికిన ఓడియన్..లివింగ్ స్టోన్