Yogi Adityanath : యోగి మామూలోడు కాదు దమ్మున్నోడు
యూపీ సీఎం రియల్ టార్చ్ బేరర్
Yogi Adityanath : భారత దేశ రాజకీయాలలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath). ఈ కాషాయ వస్త్రధారికి పాలిటిక్స్ కు ఏంటి సంబంధం అనుకుంటున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు.
అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతున్నారు. ఒక రకంగా అన్నీ తానై వ్యవహరిస్తూ డైనమిక్ లీడర్ గా ఎదిగారు. దేశ రాజకీయాలను ఒంటి చేత్తో
శాసిస్తూ దూసుకు వెళుతున్న నరేంద్ర మోదీకి వారసుడిగా పేరొందారు యోగి ఆదిత్యానాథ్.
ఇవాళ ఆయన పుట్టిన రోజు. అందుకే యోగి గురించి మరోసారి పరిచయం చేయాల్సి వస్తోంది. యూపీలో బీజేపీ తరపున మొదటి సీఎంగా 19 మార్చి 2017లో కొలువు తీరారు.
ఈ ఏడాది జరిగిన ఉత్కంఠ భరిత అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటాడు. అన్నీ తానై వ్యవహరించాడు. విపక్షాలకు చుక్కలు చూపించి కాషాయ జెండా రెపరెపలాడేలా చేశాడు యోగి ఆదిత్యానాథ్.
గోరఖ్ పూర్ నుంచి ఈసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. గతంలో ఆయన ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నాడు. యోగి ఆదిత్యానాథ్ కు ఇప్పుడు 50 ఏళ్లు.
యూపీ లోని పౌరీ గర్వాల్ జిల్లా పాంచూర్ స్వస్థలం. జూన్ 5, 1972లో పుట్టాడు యోగి.
ఆయన అసలు పేరు అజయ్ సింగ్ బిస్త్ . రాజ్ పుత్ కుటుంబంలో పుట్టాడు. డిగ్రీ చదివారు. 26 ఏళ్లకే యోగి ఆదిత్యానాథ్ తొలిసారిగా గోరఖ్ పూర్
నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
ఈతలో, బ్యాడ్మింటన్ లో ప్రావీణ్యం ఉంది. పార్లమెంట్ లో అతి పిన్న వయసు కలిగిన ఎంపీగా పేరొందారు యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath).
ఇదే గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎంపీగా విజయం సాధించి చరిత్ర సృష్టించారు.
1998, 1999, 2004, 2009, 2014 లలో గెలుపొందారు యోగి. అంతే కాదు ఓ వైపు సీఎంగా ఉన్నా గోరఖ్ పూర్ మఠాధిపతిగా కూడా వ్యవహరిస్తున్నారు. చిన్నతనం నుంచే హిందూత్వ సిద్ధాంతాల వైపు మళ్లారు.
బీజేపీలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. 44 ఏళ్లకే దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీకి సీఎంగా కొలువు తీరారు యోగి ఆదిత్యానాథ్.
ఆయన ఇప్పటికీ తాను హిందూవుననే చెప్పుకుంటారు.
ఇతర మతాలకు చెందిన వారిని హిందువులుగా మార్చడమే తన లక్ష్యమని ప్రకటించి సంచలనం రేపారు. ఏది ఏమైనా యోగి లాంటి ఒక్కడున్నా
చాలు అనే స్థితికి తీసుకు వచ్చాడు ఈ సీఎం.
Also Read : యోగి ఆదిత్యానాథ్ డైనమిక్ లీడర్ – మోదీ