Yogi Adityanath : మరోసారి బుల్డోజర్ సిద్ధమంటున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

ప్రధానమంత్రి మోదీ పంపిన నిధులను లూటీ చేశారు...

Yogi Adityanath : జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రచారానికి చివరిరోజైన సోమవారంనాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) మళ్లీ ‘బుల్డోజర్’ హెచ్చరికలు చేశారు. ”బుల్డోజర్ సిద్ధంగా ఉంది” అంటూ వ్యాఖ్యానించారు. హేమంత్ సోరెన్ సారథ్యంలోని కూటమి సర్కార్ కేంద్ర నిధులను, సహజ వనరులను కొల్లగొట్టిందని, కొల్లగొట్టిన నిధులను రికవరీ చేయడానికి బుల్డోజర్ సిద్ధంగా ఉందని అన్నారు. బుల్డోజర్ చర్య చట్టరీత్యా ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో యోగి(Yogi Adityanath) తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Yogi Adityanath Comment

”వాళ్లు(జేఎంఎం కూటమి) జార్ఖాండ్ సహజ వనరులను కొల్లగొట్టారు. ప్రధానమంత్రి మోదీ పంపిన నిధులను లూటీ చేశారు. బంగ్లాదేశ్ వలసదారులు, రోహింగ్యాల చొరబాట్లను ప్రోత్సహించారు. అది మన ఆడపిల్లలు, భూములు, రెట్టెకు తీవ్ర ముప్పుగా మారుతోంది. వాళ్లు లూటీ చేసిన సొమ్మును రికవరీ చేసేందుకు బుల్డోజర్ సిద్ధంగా ఉంది” అని యోగి అన్నారు. ల్యాండ్ జీహాద్, లవ్ జీహాద్‌ శక్తులను జేఎంఎం కూటమి ప్రోత్సహించిందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఈ రెండు శక్తులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్,జేఎంఎం నేతల ఇళ్లల్లో పెద్దఎత్తున నోట్లకట్టలు పట్టుబడ్డాయని, ఈ సొమ్మంతా కాంగ్రెస్‌దా, ఆర్జేడీ లేదా జేఎంఎందా అని ఆయన ప్రశ్నించారు. అందతా రాష్ట్రాభివృద్ధికి మోదీ పంపిన సొమ్మని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉంటే అభివృద్ధి సాధ్యమని యోగి పిలుపునిచ్చారు. జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడతల పోలింగ్ నవంబర్ 20న జరుగనుంది. నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు.

Also Read : Minister Kishan Reddy : బీజేపీ తలచుకుంటే ఎలాఉంటుందో రేవంత్ సర్కార్ కు చూపిస్తాం

Leave A Reply

Your Email Id will not be published!