Yogi Chopper : పైల‌ట్ అప్ర‌మ‌త్తం యోగికి త‌ప్పిన ప్ర‌మాదం

ప‌క్షి ఢీకొన‌డంతో అత్య‌వ‌స‌రంగా విమానం ల్యాండింగ్

Yogi Chopper : ఉత్త‌ర ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. పైల‌ట్ అప్ర‌మ‌త్తం కావ‌డంతో సీఎం క్షేమంగా బ‌య‌ట ప‌డ్డారు. ప‌క్షి ఢీకొన‌డంతో యోగి ఆదిత్యానాథ్ ప్ర‌యాణిస్తున్న హెలికాప్ట‌ర్(Yogi Chopper) వార‌ణాసిలో అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ అయింది.

అంత‌కు ముందు శ‌నివారం సీఎం వార‌ణాసిలో ప‌ర్య‌టించి అభివృద్ధి ప‌నులు, శాంతి భ‌ద్ర‌త‌ల‌ను స‌మీక్షించారు. వార‌ణాసి లోని రిజ‌ర్వ్ పోల‌స్ లైన్స్ గ్రౌండ్ నుంచి హెలికాప్ట‌ర్ ల‌క్నోకు బ‌య‌లు దేరుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఆదివారం నాడు తిరిగి తిరిగి బ‌య‌లు దేరుతుండ‌గా హెలికాప్ట‌ర్ ను ప‌క్షి ఢీంది. దీంతో పైల‌ట్ దీనిని గుర్తించి వెంట‌నే హెలికాప్ట‌ర్(Yogi Chopper) ను వార‌ణాసిలో అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ చేశారు.

అనంత‌రం భారీ భ‌ద్ర‌త మ‌ధ్య సీఎం యోగి ఆదిత్యానాథ్ మ‌ళ్లీ స‌ర్క్యూట్ హౌస్ కు వ‌చ్చార‌ని ప్రాథ‌మిక స‌మాచారం. సీఎం ప్ర‌భుత్వ విమానంలో యూపీ రాజ‌ధాని ల‌క్నోకు బ‌య‌లుదేరారు.

ఈ మొత్తం వ్య‌వ‌హారం గురించి వార‌ణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌశ‌ల్ రాజ్ శ‌ర్మ వెల్ల‌డించారు. అంత‌కు ముందు సీఎం యోగి ఆదిత్యానాథ్ వార‌ణాసిలోని కాశీ విశ్వ‌నాథ ఆల‌యంలో పూజ‌లు చేశారు.

ప‌లు అభివృద్ధి ప‌నులు, శాంతి భ‌ద్ర‌త‌ల‌ను స‌మీక్షించారు. వార‌ణాసిలో రాత్రి బ‌స చేసిన సీఎం ల‌క్నోకు బ‌య‌లు దేరారు.

ల‌క్నోలో స్వామిత్వ ప‌థ‌కం కింద 11 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ఆన్ లైన్ గ్రామీణ నివాస హ‌క్కుల ప‌త్రాల‌ను పంపిణీ చేశారు యోగి ఆదిత్యానాథ్.

ఈ ప‌థ‌కం ద్వారా ఇప్ప‌టికే 34 ల‌క్ష‌ల మంది ల‌బ్ది పొందార‌ని చెప్పారు సీఎం.

Also Read : సాధార‌ణ కుటుంబాలు అసాధార‌ణ విజ‌యాలు

Leave A Reply

Your Email Id will not be published!