Yogi Vishwanathan Anand : గ్రాండ్ మాస్ట‌ర్ తో టార్చ్ బేర‌ర్ చెస్

యోగితో విశ్వ‌నాథ‌న్ ఆనంద్ చ‌దరంగం

Yogi & Vishwanathan Anand : ఒక‌రేమో భార‌త దేశ రాజ‌కీయ రంగంలో డైన‌మిక్ లీడ‌ర్. అంతే కాదు అక్ర‌మార్కులు, నేర‌స్థుల గుండెల్లో రైళ్లు ప‌రుగెట్టించేలా చేస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్.

మ‌రొక‌రు ప్ర‌పంచ చ‌ద‌రంగంలో రారాజు. గ్రాండ్ మాస్ట‌ర్ విశ్వ‌నాథ‌న్ ఆనంద్. వీరిద్ద‌రూ క‌లిసి చెస్ ఆడితే ఎలా ఉంటుంది క‌దూ. నిజం కూడా టార్చ్ బేర‌ర్ గా పేరొందిన యోగి గ్రాండ్ మాస్ట‌ర్ తో క‌లిసి చెస్ ఆడారు.

ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ క‌లిసి ఆడుతున్న ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే యూపీలో రెండోసారి భార‌తీయ జ‌న‌తా పార్టీని అధికారంలోకి తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త ఆదిత్యానాథ్ దే.

తాజాగా రాష్ట్రంలో జ‌రిగిన రాంపూర్ , అజంగ‌ఢ్ ఉప ఎన్నిక‌ల్లో గ‌ట్టి ప‌ట్టు క‌లిగిన స‌మాజ్ వాది పార్టీ అభ్య‌ర్థుల‌కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చాడు యోగి ఆదిత్యానాథ్. ఆయ‌న డైన‌మిజం ఇప్పుడు యూపీని టాప్ లెవ‌ల్లోకి తీసుకు వెళ్లేలా చేస్తోంది.

ఇప్ప‌టికే చెస్ ఒలింపియాడ్ కు సంబంధించిన టార్చ్ రిలే ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఇటీవ‌ల ఢిల్లీలో ప్రారంభించారు. ఆ టార్చ్ రిలే ఉత్త‌ర ప్ర‌దేశ్ కు చేరుకుంది.

ఈ సంద‌ర్భంగా సీఎం యోగి ఆదిత్యానాథ్ ఐదుసార్లు ప్ర‌పంచ చ‌ద‌రంగం ఛాంపియ‌న్ అయిన విశ్వ‌నాథ‌న్ ఆనంద్(Yogi & Vishwanathan Anand) తో ఆడుతూ క‌నిపించారు.

అంత‌కు ముందు యూపీ స్పీక‌ర్ స‌తీష్ మ‌హానా 44వ సెచ్ ఒలింపియాడ్ ఉమెన్ గ్రాండ్ మాస్ట‌ర్ నుండి జ్యోతిని స్వీక‌రించారు. కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో జేజ‌స్ బ‌క్రాకు అందించారు.

ఈ జ్యోతి ల‌క్నో నుంచి లేహ్ , జ‌మ్మూ , శ్రీ‌న‌గ‌ర్, ధ‌ర్మ‌శాల‌, సిమ్లా, చండీగ‌ఢ్ , పాటియాలా, అమృత్ స‌ర్ , పానిప‌ట్ , గురు గ్రామ్ , కురుక్షేత్ర‌, డెహ్రాడూన్ , హ‌రిద్వార్ ను ఇప్ప‌టి వ‌ర‌కు క‌వ‌ర్ చేసింది.

Also Read : మిథాలీ రాజ్ లివింగ్ లెజెండ్ – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!