Yuvraj Singh : భారత క్రికెట్ జట్టుకు ఏడేళ్ల పాటు నాయకత్వం వహించిన విరాట్ కోహ్లీ అనూహ్యంగా తప్పుకున్నాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో కోహ్లీకి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యువతరంగానికి స్పూర్తి దాయకంగా నిలిచాడు.
అతడితో కలిసి ఆడిన మరో క్రికెటర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. సామాజిక మాధ్యమంలో సుదీర్ఘ లేఖ రాశాడు. అతడిపై అమితమైన ప్రేమను, అనురాగాన్ని పంచుకున్నాడు.
విరాట్ కోహ్లీ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా నీ ఆట తీరు అద్భుతం అంటూ కితాబు ఇచ్చాడు. ఓ క్రికెటర్ గా నేను నీతో పాటే ఆడాను. కానీ నువ్వు రోజు రోజుకు ఎదిగిన తీరు మాత్రం ప్రశంసనీయమని పేర్కొన్నాడు.
ఇవాళ నవతరానికి ఆదర్శ ప్రాయంగా మారావంటూ పేర్కొన్నాడు. నిన్ను చూసి తాను గర్వినిస్తున్నానని కొనియాడారు. నీకు ఆట పట్ల ఉన్న ఆసక్తి. క్రమశిక్షణ, అంకిత భావం, నిబద్దత అత్యంత అనుసరణీయం అని తెలిపాడు.
నేటి తరమే కాదు రాబోయే తరాలు కూడా నిన్ను ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకుంటాయని స్పష్టం చేశాడు యువ రాజ్ సింగ్(Yuvraj Singh). నిన్ను నీవు గొప్ప ఆటగాడిగా మారేందుకు నీవు చేసిన ప్రయత్నం గురించి ఈ కాలం సరిపోదన్నాడు.
ఎవరూ సాధించని విజయాలు స్వంతం చేసుకున్నావు. నువ్వో అద్భుతం. లెజెండరీ నాయకుడివి. గొప్ప ఆటగాడివే కాదు అద్భుతమైన మానవత్వం కలిగిన వ్యక్తివి నువ్వు అంటూ కోహ్లీకి కితాబు ఇచ్చాడు యువరాజ్ సింగ్.
Also Read : బుమ్రాపై సన్నీ ప్రశంసల జల్లు