Rohit Sharma : భారత జట్టు పింక్ బాల్ టెస్టులో శ్రీలంకపై విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ అనంతరం స్కిప్పర్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అన్ని ఫార్మాట్ లలో భారత జట్టు రాణించింది. అందరూ కలిసి కట్టుగా తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. వెస్టిండీస్, శ్రీలంకపై గణనీయమైన విజయాలను నమోదు చేశాం.
కానీ ఈ గెలుపు నా దృష్టిలో విజయం కాదంటాను. ఎందుకంటే ఇంట్లోనే కాదు బయట కూడా గెలిచినప్పుడే మనం నిజమైన సక్సెస్ అందుకున్నట్లు అని పేర్కొన్నాడు.
ప్రస్తుతం రోహిత్ శర్మ(Rohit Sharma )చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఈ విజయ పరంపర బాగుంది. వ్యక్తిగతంగా, నాయకుడిగా నాకు సంతోషం కలిగిస్తోంది. కానీ మనం ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నాడు.
చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దు కోవాల్సిన అవసరం ఉంది. త్వరలో జరగబోయే వరల్డ్ కప్ పై ఫోకస్ పెట్టాల్సి ఉంది. ఇంతలో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది.
ఏ ఫార్మాట్ లోనైనా ఆడే ఆటగాళ్లు ముందుగా గుర్తు పెట్టుకోవాల్సింది పేషన్ కలిగి ఉండడం. ఎవరైనా సరే జట్టుకే కాదు ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న సంగతిని ఎల్లప్పటికీ గుర్తు పెట్టుకుని ఆడాలన్నాడు.
ఒక రకంగా ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేశాడు. ఇదే పర్ ఫార్మెన్స్ విదేశాలలో భారత్ ఆడుతున్నప్పుడు ప్రదర్శించాలన్నాడు. లేక పోతే ఇది సక్సెస్ కానే కాదన్న అర్థం వచ్చే రీతిలో మాట్లాడాడు.
Also Read : రవిచంద్రన్ అశ్విన్ సెన్సేషన్