IND u19 Vs ENG U19 : ఇవాళ ఎవరు ఛాంపియన్ గా నిలుస్తారనేది తేలి పోతుంది. ఆఖరి అంకానికి తెర పడనుంది కొన్ని గంటల్లో. వెస్టిండీస్ వేదికగా అండర్ -19 వరల్డ్ కప్(IND u19 Vs ENG U19 )ఫైనల్ ఆడేందుకు భారత జట్టు సిద్దమైంది.
ఇప్పటికే ఫుల్ ప్రాక్టీస్ లో మునిగి తేలారు మన కుర్రాళ్లు. అండర్ -19 భారత జట్టు (IND u19 Vs ENG U19 )సెకండ్ సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాను భారీ తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో జట్టు స్కిప్పర్ యశ్ ధుల్ దుమ్ము రేపాడు.
ఆంధ్రా కుర్రాడు రషీద్ రాణించాడు. ఇక 24 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఇంగ్లండ్ జట్టు ఫస్ట్ సెమీస్ లో ఆఫ్గనిస్తాన్ ను మట్టి కరిపించి ఫైనల్ కు చేరుకుంది. ఇవాళ ఫైనల్ పోరుకు ఇరు జట్లు సిద్దమయ్యాయి.
టీమిండియా జట్టులో కరోనా కలకలం రేపింది. పలువురు ఆటగాళ్లు ఈ వైరస్ బారిన పడ్డారు. చివరకు కెప్టెన్ యశ్ ధుల్ కూడా.
కానీ ఎక్కడా మనో స్థైర్యం కోల్పోలేదు. క్వారంటైన్ లోనే ఉంటూ ప్రాక్టీస్ చేశాడు.
వీడియోలు తన క్రికెట్ కోచ్ కు పంపించాడు. ఆ తర్వాత బరిలోకి దిగాడు. సెమీస్ లో సెంచరీతో సత్తా చాటాడు.
ఈ వరల్డ్ కప్ లో ఏ ఒక్క మ్యాచ్ కూడా భారత జట్టు ఓడి పోలేదు.
ఇవాళ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ పేరు మీద ఏర్పాటు చేసిన స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
తాడో పేడో తేల్చుకునేందుకు యువ భారత్ సిద్దమైంది.
ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు కూడా తక్కువేమీ కాదు. అన్ని రంగాల్లో బలంగా ఉంది ఆ జట్టు. ఇ
క మ్యాచ్ విషయానికి వస్తే ఇరు జట్లు ఓటమి అన్నది లేకుండా నేరుగా ఫైనల్ కు చేరుకున్నాయి.
గత ఏడాది రన్నర్ అప్ గా నిలిచిన భారత జట్టు కప్ తో వస్తుందా అన్నది వేచి చూడాలి. ఇక జట్ల అంచనా ప్రకారం ఇలా ఉన్నాయి.
భారత జట్టు లో యశ్ ధుల్ – స్కిప్పర్, రఘు వంశీ, సింగ్, రషీద్ , రాజ్ వర్దన్ , నిశాంత్ , దినేశ్ , తాంబే, రాజ్ బావా, విక్కో , రవికుమార్ ఉన్నారు.
ఇంగ్లండ్ జట్టులో టాప్ ప్రెస్ట్ కెప్టెన్ కాగా థామస్, బెథెల్, జేమ్స్ , లక్స్ , జార్జ్ బెల్ , రేహాన్ , అలెక్స్ , సలెస్ , వాల్, బెడెన్ ఉన్నారు.
Also Read : ఇంగ్లండ్ టీమ్ హెడ్ కోచ్ పై వేటు