IND U19 vs ENG U19 : యావత్ భారత దేశం గర్వించేలా అండర్ -19 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది యువ భారత జట్టు. వెస్టిండీస్ వేదికగా సర్ వివియన రిచర్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్ లో 4 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించి చరిత్ర సృష్టించింది.
అండర్ -19 వరల్డ్ కప్ చరిత్రలో భారత జట్టు ఛాంపియన్ గా గెలవడం ఇది ఐదోసారి. ఢిల్లీకి చెందిన క్రికెటర్ యశ్ ధుల్ నాయకత్వంలోని అండర -19 భారత జట్టు(IND U19 vs ENG U19) విశ్వ విజేతగా నిలిచింది.
మేరా భారత్ మహాన్ అంటూ నినదించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు 189 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో రాజ్ దువా 5 వికెట్లు రవికుమార్ 4 వికెట్లు పడగొట్టి తక్కువ స్కోర్ కే పరిమితం చేశారు.
అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదిలోనే వికెట్ కోల్పోయింది. ఇక టీమిండియాలో (IND U19 vs ENG U19)నిషాంత్ సింధు 50 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత్ సాదించిన విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆంధ్రా కుర్రాడు షేక్ రషీద్ మరోసారి సత్తా చాటాడు. సరిగ్గా హాఫ్ సెంచరీ చేసి వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ సేల్స్ , బోయ్ డెన్, అస్సిన్ వాల్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఇక ఇంగ్లండ్ బ్యాటింగ్ పరంగా చూస్తే జేమ్స్ రూ 116 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లతో 95 పరుగులు చేశాడు. అతడొక్కడే భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొని జట్టు స్కోర్ పెంచేందుకు యత్నించాడు.
జేమ్స్ సేల్స్ తో కలిసి 8 వ వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
Also Read : రూల్స్ తెలియకుండానే బాస్ అయ్యానా