Hero Vijay-Y Category : యంగ్ పొలిటిషన్, హీరో విజయ్ కు వై కేటగిరీ సెక్యూరిటీ

కేంద్రం కల్పించే ప్రత్యేక భద్రతలో మొత్తం నాలుగు రకాలు ఉంటాయి...

Hero Vijay : తమిళ స్టార్‌ నటుడు, ఇటీవలె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తలపతి విజయ్‌కి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పిస్తూ ఆదేశలు జారీ చేసింది. విజయ్‌(Hero Vijay)కి వై కేటగిరీ సెక్యురిటీని కేటాయించింది. ఈ వై కేటగిరీ సెక్యూరిటీలో మొత్తం 8 మంది ఉండనున్నారు. గతేడాది తమిళగ వెంట్రీ కళగం పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన విజయ్‌.. ఇటీవలె జనంలోకి రావడం మొదలుపెట్టారు. దీంతో విజయ్‌కి భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. తమిళనాడులో వై కేటగిరీ సెక్యూరిటీ కేవలం విజయ్‌(Hero Vijay)కి మాత్రమే ఉండటం గమనార్హం. అయితే ఈ వై కేటగిరీ సెక్యూరిటీలో ఒకరిద్దరు ఎన్‌ఎస్‌జీ (నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌) కమాండోస్‌ ఉంటారు. మిగతా వాళ్లు పోలీస్‌ అధికారులు ఉంటారు. ఈ సెక్యూరిటీ సాధారణంగా ప్రాణహాని ఉన్న ప్రముఖ వ్యక్తులకు కల్పిస్తారు.

Hero Vijay Got Y Category Security

కేంద్రం కల్పించే ప్రత్యేక భద్రతలో మొత్తం నాలుగు రకాలు ఉంటాయి. అవి ఎక్స్‌, వై, జెడ్‌, జెడ్‌ ప్లస్‌ గా విభజిస్తారు. వ్యక్తుల హాదా, వారికి ఉండే త్రెట్స్‌ ఆధారంగా ఈ నాలుగు రకాల సెక్యూరిటీలో ఒకదాన్ని కేటాయిస్తారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చు పెడుతుంది. కాగా, ఈ నాలుగు కేటగిరీల్లో ఎక్స్‌ కేటగిరీ బేసిక్‌ లెవల్‌. ఇందులో ఇద్దరు సాయుధ సివిల్‌ పోలీసులు ఉంటారు. 8 గంటల డ్యూటీ రూల్‌తో మొత్తం ఆరుగురు షిఫ్ట్‌ల వారిగా సెక్యూరిటీ ఇస్తారు. ఇక వై గురించి ఆల్రెడీ పైన చెప్పుకున్నాం. వై తర్వాత జెడ్‌ కేటగిరీ వస్తుంది. ఇందులో మొత్తం 22 మంది ఉంటారు. వీరిలో 4 నుంచి 5 మంది ఎన్‌ఎస్‌జీ కంమాడోలు ఉంటారు. మిగతా వాళ్లు పోలీసు అధికారులు.

ఈ జెడ్‌ కేటగిరీలో ఎస్కార్ట్‌ వాహనం కూడా కల్పిస్తారు.ఇక నాలుగు కేటగిరీల్లో హై లెవల్‌.. జెడ్‌ ప్లస్‌ కేటగిరీ. ఇందులో పటిష్టమైన భద్రత ఉంటుంది. మొత్తం 55 మంది ఉంటారు. ఈ 55 మందిలో 10 ఎన్‌ఎస్‌జీ కంమాడోలు ఉంటారు. ఈ జెడ్‌ ప్లస్‌ కేటగిరీని ప్రభుత్వంలో ఉన్నత హాదాలో ఉన్న వారికి లేదా ఉగ్రవాదులు, సంఘవిద్రోహక శక్తుల నుంచి తీవ్ర ప్రాణహాని ఉన్న వారికి మాత్రమే కల్పిస్తారు.ఈ జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీకి కొన్ని సందర్బాల్లో ఎస్‌పీజీ(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌) కూడా మద్దతు ఇస్తుంది. సాధారణంగా ప్రధాన మంత్రికి ఈ ఎస్పీజీ సెక్యూరిటీ కల్పిస్తారు.

Also Read : ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం

Leave A Reply

Your Email Id will not be published!