YS Jagan : భూ నిర్వాసితుల‌కు జ‌గ‌న్ భ‌రోసా

గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ బాధితుల‌కు అండ‌

YS Jagan : ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(YS Jagan)  తీపి క‌బురు చెప్పారు. గ‌త కొంత కాలంగా అప‌రిష్కృతంగా ఉన్న ఏపీలోని గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నిర్వాసితుల‌కు ప‌రిహారం ఓ కొలిక్కి వ‌చ్చింది. ఈ మేర‌కు శ‌నివారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు సీఎం. భూ నిర్వాసితుల‌కు శుభ వార్త చెప్పారు. ఎవ‌రైతే భూమిని కోల్పోయారో వారంద‌రికీ ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని ప్ర‌క‌టించారు.

వ‌చ్చే మే నెల‌లో ఈ మేర‌కు మొత్తం న‌ష్ట పోయిన బాధితుల‌కు రూ. 44 కోట్లు మంజూరు చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఈ స‌మ‌స్య గ‌త ఏడేళ్లుగా కొన‌సాగుతూ వ‌స్తోంది. బాధితులు త‌మ గోడును అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారి విన్న‌విస్తూ వ‌చ్చారు. ఎట్ట‌కేల‌కు బాధితుల‌కు మోక్షం ల‌భించింది.

ఇప్ప‌టికే రాష్ట్రంలో ప‌లు సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తూ వ‌స్తున్నది వైసీపీ స‌ర్కార్. ఇందులో భాగంగా ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న త‌ర్వాత గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టు ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ గా రూపు దిద్దుకుంది. విమానాల‌కు సంబంధించి ర‌న్ వే కోసం గ‌తంలో కొలువు తీరిన నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం 2016లో రైతుల నుంచి భూముల‌ను సేక‌రించింది.

గ‌న్న‌వ‌రం చుట్టు ప‌క్క‌ల ఉన్న 5 గ్రామాల‌కు చెందిన 662 మంది రైతులు దాదాపు 800 ఎక‌రాల త‌మ స్వంత భూముల‌ను ప్ర‌భుత్వానికి అంద‌జేశారు. కొంద‌రు ఈ స‌మ‌యంలో ఇళ్లు కూడా కోల్పోయి నిరాశ్ర‌యుల‌య్యారు. గ‌తంలోనే ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ బాధిత రైతుల‌కు భ‌రోసా ఇచ్చారు. తాను ప‌రిహారం ఇప్పిస్తాన‌ని మాటిచ్చారు. సీఎం జ‌గ‌న్(YS Jagan)  తో ప్ర‌య‌త్నించి ప‌రిహారం ఇచ్చేలా చేశారు.

Also Read : ఏపీ సీఎం క‌ప్ కు ఘ‌నంగా ఏర్పాట్లు – రోజా

Leave A Reply

Your Email Id will not be published!