YS Jagan : అండర్ -`19 భారత జట్టు వైస్ కెప్టెన్ ఆంధ్రాకు చెందిన క్రికెటర్ షేక్ రషీద్ ను ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే రోజుల్లో మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు.
వరల్డ్ కప్ గెలుచుకున్నాక స్వంత స్థలానికి వచ్చాక తాను త్వరలోనే ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డిని(YS Jagan) కలుస్తానని మీడియాకు వెళ్లడించారు. వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు.
ఎవరీ కుర్రాడు అంటూ భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్ లలో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. కీలక పాత్ర పోషించాడు షేక్ రషీద్.
ఇవాళ తన తల్లిదండ్రులతో కలిసి ఇవాళ సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా షేక్ రషీద్ ను ఆశీర్వదించారు. నీకు మంచి భవిష్యత్తు ఉందన్నారు.
సీఎం తనను ఆప్యాయంగా పలకరించడంపై సంతోషానికి లోనయ్యాడు షేక్ రషీద్. ప్రభుత్వం తరపున పలు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. అంతే కాకుండా రూ. 10 లక్షల నగదు బహుమతి ఇచ్చారు.
అంతే కాకుండా గుంటూరులో నివాసం ఉండేందుకు స్థలం కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. క్రికెట్ రంగంలో మరింత ఎదిగేందుకు ఏం కావాలన్నా ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని చెప్పారు జగన్ రెడ్డి(YS Jagan).
అంతే కాకుండా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రకటించిన రూ. 10 లక్షల చెక్కును ఈ సందర్భంగా సీఎం చేతుల మీదుగా షేక్ రషీద్ కు అందించారు. ఈ సందర్భంగా రషీద్ పేరెంట్స్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : ‘హసన్’ మగాడు కానీ పక్కన పెట్టారు