YS Jagan Davos : దిగ్గజాలతో జగన్ ములాఖాత్
బీసీజీ గ్లోబల్ చైర్మన్ పాల్ బక్నర్ తో భేటీ
YS Jagan Davos : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి దావోస్(YS Jagan Davos) లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో బిజీగా గడుపుతున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థల అధిపతులతో ఆయన వరుస భేటీలు కొనసాగుతున్నాయి.
బీసీజీ గ్లోబల్ చైర్మన్ హాన్స్ పాల్ బక్నర్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు సీఎం. వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఒప్పందం చేసుకుంది.
ఇదిలా ఉండగా కాలుష్య రహిత ఇంధనాలు, తయారీ రంగంపై ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు జగన్ . ఇక ఏపీలో పోర్టు (ఓడరేవు) ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి వివరించారు.
ఇప్పటికే జగన్ రెడ్డి డబ్ల్యూఈఎఫ్ చీఫ్ , ఫౌండర్ క్లాజ్ ష్వాప్ , అదానీ గ్రూపు సంస్థల చైర్మన్ గౌతం అదానీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దావోస్ వేదికపై సీఎం(YS Jagan Davos) ప్రసంగించారు.
కాలుష్యం లేని పారిశ్రామిక ప్రగతి కోసం చర్యలు తీసుకున్నామని చెప్పారు. మానవ వనరుల తయారీ, నైపుణ్య అభివృద్ధి పై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని తెలిపారు.
కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థలను తిరిగి గాడిలో పెడుతున్నామని వెల్లడించారు. కొనుగోలు శక్తి పెరిగేలా చేశామని, పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామని జగన్ రెడ్డి చెప్పారు.
కాగా విద్య, వైద్య రంగాలపై ఏపీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. కొత్తగా పెట్టబుడులు రావాలన్నా, పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నా ఈ రంగాలే కీలకమన్నారు.
Also Read : వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జగన్ బిజీ