YS Jagan Meet : మాజీ ఎమ్మెల్యే వంశీని జైలుకు వెళ్లి పరామర్శించిన మాజీ సీఎం

భద్రతా కారణాలతో అనుమతి ఇవ్వలేదు అధికారులు...

YS Jagan : విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీని పరామర్శించారు ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌. ములాఖత్‌లో వైఎస్‌ జగన్‌ వంశీని కలిశారు. జరిగిన పరిణామాల గురించి జగన్‌ వంశీని అడిగి తెలుసుకుంటున్నారు. కిడ్నాప్‌ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ములాఖత్‌కు పేర్నినాని, కొడాలి నానికి అనుమతి నిరాకరించారు అధికారులు. భద్రతా కారణాలతో అనుమతి ఇవ్వలేదు అధికారులు.

YS Jagan Meet…

ములాఖత్‌ ముగిశాక బయటకు వచ్చి వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. వంశీని అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ దిగజారిపోతుందని, కేసు పెట్టలేదని సత్యవర్ధనే కోర్టుకు చెప్పాడని అన్నారు. సత్యవర్ధన్‌ వాంగ్మూలం కూడా నమోదు చేశారన్నారు. వంశీపై కావాలనే తప్పుడు కేసులు నమోదు చేసినట్లు జగన్‌ ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు జైలు వద్దకు భారీగా చేరుకోవడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. బారికేడ్లు ఉంచి 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.

Also Read : Eknath Shinde : సీఎం ఫడ్నవీస్ కు తనకు ఉన్న విభేదాలపై క్లారిటీ ఇచ్చిన షిండే

Leave A Reply

Your Email Id will not be published!