YS Jagan : జాతీయ జెండా ఆత్మ గౌరవానికి ప్రతీక
ఏపీ సీఎం సందింటి జగన్మోహన్ రెడ్డి
YS Jagan : జాతీయ జెండా ఆత్మ గౌరవానికి ప్రతీక అని అన్నారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భారతీయ త్రివర్ణ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. విజయవాడ లోని ఇందిరాగాందీ మున్సిపల్ స్టేడయంలో ఏపీ ప్రభుత్వం స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించింది.
సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దేశ సార్వభౌమత్యానికి, ఆత్మ గౌరవానికి, ఐక్యమత్యానికి జాతీయ జెండా నిలువుటద్దమన్నారు జగన్ మోహన్ రెడ్డి(YS Jagan).
ఎందరో త్యాగధనులు, స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పిస్తే దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. ఆనాటి మహనీయుల త్యాగాలను మనందరం స్మరించు కోవాలని పిలుపునిచ్చారు.
జాతికి గర్వ కారణంగా నిలిచిన జాతీయ పతాకాన్ని తయారు చేసిన ఘనత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్యకే దక్కుతుందన్నారు. ఇది మనందరికీ గర్వకారణమన్నారు.
మహాత్ముడు బాపూజీ చూపిన బాటలో మనందరం నడవాలని పిలుపునిచ్చారు జగన్ రెడ్డి. దేశ స్వాతంత్ర ఫలాలు ఇవాళ అగుపిస్తున్నాయని, దేశ అభివృద్దిలో మన రాష్ట్రం కూడా భాగస్వామిగా ఉందన్నారు.
ఆనాటి స్వాతంత్ర సమరయోధులు కన్న కలల్ని నిజం చేసేందుకు తాను కృషి చేస్తున్నానని చెప్పారు. ఈ దేశ, రాష్ట్ర భవిష్యత్తు యువతపై ఉందని వారంతా కలిసి కట్టుగా తమ జీవితాలను అభివృద్ధి కోసం అంకితం చేయాలని కోరారు సీఎం.
విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
Also Read : యువత దేశం కోసం అంకితం కావాలి