YS Jagan : అధికారం ఉన్నప్పుడు పదవులిచ్చాం ఎప్పుడు కృతజ్ఞతగా పనిచేయండి
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు....
YS Jagan : అధికారంలో ఉండగా మీ అందరికీ పదవులు ఇచ్చానని.. అందుకు కృతజ్ఞతగా ఇప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని వైసీసీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కోరారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎవరెవరు శ్రమిస్తున్నారో గమనించడం కష్టమని.. కానీ ప్రతిపక్షంలో ఉండగా పార్టీ బలోపేతానికి ఎవరెవరు కష్టపడి పనిచేస్తున్నారో సులువుగా తెలుసుకోవచ్చని చెప్పారు. సోమవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసి బయటకు వచ్చాక.. తాడేపల్లి ప్యాలె్‌సలో పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు.
YS Jagan Comment
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే శాసనసభలో బలంగా ప్రజాసమస్యలను లేవనెత్తేందుకు వీలుంటుందని జగన్ మరోసారి స్పష్టం చేశారు. అప్పుడే ముఖ్యమంత్రితో సమానంగా సభలో మాట్లాడే అవకాశం వస్తుందన్నారు. ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానని పునరుద్ఘాటించారు. కాగా.. ప్రతిపక్ష నేత పదవి లేకున్నా.. సభకు వెళ్తేనే కదా ప్రభుత్వం ఏం చేస్తోందో తెలిసేదని వైసీపీ నేతలు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతల పనితీరు తెలుసుకోలేమన్న ఆయన వ్యాఖ్యలతోనూ వారు విభేదిస్తున్నారు.
Also Read : Tirupati Court : కల్తీ నెయ్యి కేసులో ఏఆర్ డైరీ ఎండీ ‘రాజశేఖర్’ కు కోర్టు షాక్