YS Jagan : జగన్ బెయిల్ రద్దు విచారణ వాయిదా వేసిన ధర్మాసనం

జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది...

YS Jagan : వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి(YS Jagan) అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో అక్రమాస్తుల కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు. జగన్(YS Jagan) కేసుల విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినప్పటికీ సీబీఐ కేసుల్లో తీర్పు తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని 2022 నవంబర్‌లో తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ గత ఏడాది మే నెలలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

YS Jagan Case Updates

జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ ‘నాట్ బిఫోర్ మి’ అనడంతో విచారణ వేరే ధర్మాసనానికి బదిలీ చేశారు. డిసెంబర్ 2వ తేదీన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ముందు విచారణకు సీజేఐ సంజీవ్ ఖన్నా ఆదేశించారు. గతంలో కూడా జస్టిస్ సంజయ్ కుమార్ తన ముందు ప్రస్తావించవద్దని చెప్పినా పొరపాటున ఈరోజు లిస్ట్ అయినట్లు సీజేఐ సంజీవ్ ఖన్నా తెలిపారు.

జగన్బెయిల్ రద్దు చేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈరోజు సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇవాళ ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి సంజయ్ కుమార్ పిటీషన్ విచారణకు సుముఖత చూపకపోవడంతో విచారణ వాయిదా పడింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా రఘురామ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపైనా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనమే విచారణ జరుపుతుందని సీజేఐ సంజీవ్ ఖన్నా తెలిపారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Also Read : MP Kiran Kumar Reddy : కలెక్టర్ పై దాడి వెనుక బీఆర్ఎస్ అండ ఉంది

Leave A Reply

Your Email Id will not be published!