YS Sharmila: కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో షర్మిల పిటీషన్ !

కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో షర్మిల పిటీషన్ !

YS Sharmila: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడవద్దన్న కడప కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. షర్మిల వేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనితో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై షర్మిల మాట్లాడటానికి కోర్టు అనుమతిచ్చినట్లయింది.

YS Sharmila Petition

వివేకా హత్య గురించి మాట్లాడవద్దంటూ కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేసిన పిటీషన్‌పై కడప కోర్టు ఏప్రిల్16వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. కడప కోర్టు ఉత్తర్వులపై షర్మిల హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు ఆమె పిటీషన్‌ను కొట్టేసింది. దీనితో షర్మిల సుప్రీంకోర్టుకు వెళ్లారు. షర్మిల పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.వాక్ స్వాతంత్రాన్ని, వ్యక్తి స్పేచ్ఛను హరించేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడుతామని తెలిపింది.

Also Read : Andhra Pradesh Government: పెట్రోల్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం !

Leave A Reply

Your Email Id will not be published!