YS Sharmila: జంతర్ మంతర్ ధర్నాపై వైఎస్ జగన్ పై షర్మిల ఫైర్ !
జంతర్ మంతర్ ధర్నాపై వైఎస్ జగన్ పై షర్మిల ఫైర్ !
YS Sharmila: రాష్ట్రంలో అధికార పార్టీ దాడులను నిరశిస్తూ ఢిల్లీ వేదికగా తాను చేపట్టిన నిరసన కార్యక్రమానికి దేశంలోని అన్ని పార్టీలు మద్దత్తు తెలపాలని కోరిన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఏపీపీసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆమె జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న మీరు… అసలు మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి అంటూ వైఎస్ జగన్ ను ఆమె ప్రశ్నించారు.
YS Sharmila Comment
‘‘పార్టీ ఉనికి కోసం దిల్లీలో కపట నాటకం ఆడినందుకా ? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా ? 5 ఏళ్లు భాజపాతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులు, ప్రత్యేక హోదాను వారికి తాకట్టు పెట్టినందుకా ? అంటూ ప్రశ్నించారు. మణిపుర్ ఘటనపై ఇన్నాళ్లు నోరెత్తని మీకు ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకురావడం విడ్డూరంగా ఉందన్నారు. విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా ? వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకే జై కొట్టారు కదా? మణిపుర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి సంఘీభావం వచ్చిందా? మీ నిరసనలో నిజం లేదని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. అందులో జగన్ స్వలాభం తప్పా… రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలపలేదు. సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు?’’ అని షర్మిల విమర్శించారు.
Also Read : Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ లో ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం